పెళ్ళైన నటుడితో త్రిష ప్రేమాయణం.. బోర్ కొట్టేసరికి దూరం పెట్టాడు.. అతర్వాత?

దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో గత దశాబ్ద కాలం నుంచి అగ్రతారగా ఎన్నో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో త్రిష ఒకరు.

ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

ఈ క్రమంలోనే తెలుగులో ఈమె నటించిన వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, పౌర్ణమి, వంటి ఎంతో అద్భుతమైన చిత్రాల్లో నటించి ఎంతో గుర్తింపు తెచ్చుకుంది.

ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దశాబ్దకాలం పూర్తయినప్పటికీ ఇప్పటికీ సినిమా అవకాశాలను అందుకొని తనదైన శైలిలో దూసుకుపోతోంది.

ఒకప్పుడు కమర్షియల్ చిత్రాల్లో నటించిన త్రిష ఆ తర్వాత లేడి ఓరియెంటెడ్ చిత్రాలలో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

ఈమె తెలుగులో కన్నా తమిళంలో ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

కెరియర్ పరంగా ఎంతో అద్భుతంగా ముందుకు దూసుకుపోతున్న త్రిష తన వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ నిత్యం వార్తల్లో ఉంటున్నారు.

ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో ఈమె ఒక పెళ్లైన స్టార్ హీరోతో ఎఫైర్ పెట్టుకున్నట్లు అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

ఆ వార్తలకు అనుగుణంగానే త్రిషతో సదరు నటుడు ప్రవర్తించడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.

"""/"/ దక్షిణాది సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న పెళ్లైన నటుడి ప్రేమలో పడిన త్రిష ఆ తర్వాత తనతో కలిసి ఎన్నో చిత్రాలలో నటించడంతో వీరిద్దరి మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది అంటూ అప్పట్లో వీరి నటన పై ప్రశంసలు కురిపిస్తూ హిట్ పెయిర్ గా భావించారు.

ఈ క్రమంలోనే ఆ నటుడు మరొక హీరోయిన్ తో చనువుగా ఉంటున్నాడన్న విషయం తెలుసుకున్న త్రిష పూర్తిగా ఆ నటుడిపై కోపం పెంచుకుంది.

ఈ క్రమంలోనే సదరు నటుడితో ప్రేమలో ఉన్నట్లు వార్తలు షికార్లు చేసిన సమయంలో హీరో మరొక హీరోయిన్ తో చనువుగా ఉండటంతో త్రిష బోర్ కొట్టిందని, అందుకే తనని దూరం పెట్టాడంటూ మరోసారి వార్తలు త్రిష గురించి పెద్ద ఎత్తున వినిపించాయి.

"""/"/ ఈ క్రమంలోనే ఆ హీరోయిన్ తో త్రిషకు మాటలు కూడా ఉండేవి కాదని అప్పట్లో వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనెంత శత్రుత్వం ఏర్పడిందని ఇండస్ట్రీ సమాచారం.

అయితే ఈ విధంగా పెళ్లయిన నటుడితో ప్రేమ వ్యవహారాలు చేసిన అనంతరం సినిమాలపై దృష్టి సారించి ఎన్నో చిత్రాలలో నటించారు.

ఈ క్రమంలోని నిశ్చితార్థం చేసుకుని పెళ్లి దగ్గర పడుతుంది అనగా తన వివాహాన్ని క్యాన్సిల్ చేసుకుంది.

అప్పటి నుంచి ఈమె గురించి వార్తలు మళ్లీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున షికార్లు చేశాయి.

ఈమె ఓ దర్శకుడితో ప్రేమలో పడిందని త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని ఈమె గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నప్పటికీ ఈ విషయంపై త్రిష స్పందిస్తూ తాను పెళ్లి చేసుకుంటే ముందుగా అందరికీ వెల్లడిస్తానని తెలియజేశారు.

అతని ఎవరు బయటకు గెంట లేదు… క్లారిటీ ఇచ్చిన నాగ మణికంఠ చెల్లెలు!