అస‌లు పేరే లేని ఈ రైల్వే స్టేష‌న్ గురించి మీకు తెలుసా..

రైల్వే స్టేషన్ కానీ బస్ స్టేషన్ కు కానీ పేర్లు లేకపోతే ఎట్టుంటాయో తెలసా.

వినేందుకే ఆశ్చర్యంగా ఉన్న ఈ వార్తను గనుక చదివితే షాక్ కు గురికావడం ఖాయం.

అటువంటి ఓ స్టేషన్ ఉందని ఇంతవరకూ సరిగా ఎవ్వరికీ తెలియదు.కానీ మన ఇండియాలో పేరులేని రైల్వే స్టేషన్ ఒకటి ఉంది.

ఈ విషయం చెప్పింది ఎవరో కాదు భారత రైల్వే శాఖ కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది.

ఇంతకీ పేరు లేని ఈ రైల్వే స్టేషన్ ఎక్కడ ఉందంటే.2017లో రైల్వే శాఖ ప్రకటించిన వివరాల ప్రకారం మన దేశంలో మొత్తం అప్పటి వరకు 7349 రైల్వే స్టేషన్లు ఉన్నాయి.

కొన్ని రైల్వే స్టేషన్లకు పెద్ద పేర్లు ఉంటే మరికొన్ని రైల్వే స్టేషన్లకు చిన్న పేర్లు ఉన్నాయి.

కానీ ఇలా పేరే లేని రైల్వే స్టేషన్ ఉండడం నిజంగా ఆశ్చర్యమే.ఈ పేరు లేని రైల్వే స్టేషన్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉంది.

ఈ రైల్వే స్టేషన్ కు పేరు పెట్టకపోవడానికి అక్కడ పెద్ద చరిత్రే ఉందట.

"""/"/ ఈ స్టేషన్ కు పేరు పెడదామని చూడగా.రేనా మరియు రాయ్ నగర్ గ్రామాల ప్రజలు తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారట.

ఈ సమస్య కొలిక్కి వచ్చేలా లేదని తెలిసి రైల్వే అధికారులు ఈ స్టేషన్ కు పేరు పెట్టకుండా వదిలేశారు.

2008 వ సంవత్సరం నుంచి ఈ స్టేషన్ పేరు లేకుండానే ఉంది.ఈ స్టేషన్ లో ప్రతి రోజూ ఆరు రైళ్లు ఆగుతాయని రైల్వే అధికారులు చెబుతున్నారు.

అయినా కూడా ఈ స్టేషన్ కు పేరు పెట్టలేదు.నిజంగా విచిత్రంగా ఉంది కదూ.

పేరు లేని రైల్వే స్టేషన్ ఉండడం.మరి ఆ స్టేషన్ లో దిగే వారు ఏం పేరు చెప్పి టికెట్ తీసుకుంటారో.

వీవీప్యాట్లపై ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు..!