దేవాలయ గోపుర కలశ రహస్యం గురించి తెలుసా..?
TeluguStop.com
సాధారణంగా రాజుల పాలనలో పట్టణంలోని దేవాలయ గోపురం( Temple Dome ) కంటే ఎత్తుగా ఏ భవనము ఉండకూడదని ఆంక్షలు విధించేవారు.
ఎందుకంటే దేవాలయ గోపురం పై భాగంలో ఉన్న కలశం బంగారం, వెండి లేదా రాగితో తయారు చేసేవారు.
ఈ కలశలలో పోసిన ధాన్యాలు లోహాలకు విద్యుత్ అయస్కాంత తరంగాలను ఆకర్షించే శక్తి ఉండదు.
అదే విధంగా దేవాలయ గోపుర కలశంలో వరి, జొన్న, మొక్కజొన్న, నువ్వులు, రాగులు, మినుములు వంటి ధాన్యాలతో నింపుతారు.
ఇందులో ముఖ్యంగా తృణధాన్యాలు ( Cereals )ఎక్కువగా ఉంటాయి.ఎందుకంటే పిడుగులను తట్టుకునే మహాశక్తి వాటికి ఉంటుందని పెద్దవారు చెబుతున్నారు.
"""/" /
ఈ టెక్నికల్ అత్యంత ఖచ్చితమైనదని ప్రస్తుత శాస్త్రం చెబుతోంది.అయితే ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నాశనమైనా, దేవాలయ శిఖరం ( Temple )పైనున్న కలశం నుంచి ధాన్యాన్ని తిరిగి వ్యవసాయానికి ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది.
ప్రతి కలశంలో నింపిన ధాన్యాలు సుమారు 50 కిలోల కంటే ఎక్కువగా ఉంటాయి.
వరదలు లేదా కొన్ని రకాల శక్తివంతమైన ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మొక్కలు, పంటలు( Plants , Crops ) మొదలైన వాటిని తుడిచి పెట్టే అవకాశం ఉంటుంది.
అలాంటి సమయంలో ప్రజలకు జీవనోపాధి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. """/" /
ఆహార కొరతను నివారించడానికి దాన్యాలు సాగు ప్రయోజనం కోసం కలశం నుంచి తీసుకుంటారు.
ఇది భవిష్యత్తులో వృద్ధికి అవకాశం కల్పిస్తుంది.విస్తరణమైన వడగలు సంభవించినప్పుడు నీటిమట్టం ఎత్తులో ఉన్న కలశాలను తాకదు.
గింజలు సురక్షితంగా ఉంటాయని చాలామంది ప్రజలు నమ్ముతారు.ఈ శిఖరం పైన ఉన్న కలశంలో దాన్యం వర్షాలకు రక్షణగా, పొడిగా ఉంటుంది.
ఇంకొక వాస్తవం ఏమిటంటే లోహ కలశంలోని ధాన్యం, పప్పులు నిర్మాణంపై పిడుగుల ప్రభావాన్ని తగ్గిస్తాయి.
దానికి ఎలాంటి హాని లేకుండా నివారిస్తాయి.ఈ కలశాలలోని ధాన్యాలు 12 సంవత్సరాల వరకు వాటి శక్తిని కోల్పోకుండా అలానే ఉంటాయి.
అందుకే 12 సంవత్సరాలకు ఒకసారి ఊర్లలో ప్రత్యేక పండుగను నిర్వహించి కలశంలోని పాత గింజలను తొలగించి కొత్త గింజలను నింపుతూ ఉంటారు.
ప్రస్తుత కాలంలోనీ వారు దీన్ని ఒక సంప్రదాయంగా మాత్రమే అనుసరిస్తున్నారు.
ఎన్టీయార్ ప్రశాంత్ నీల్ సినిమాలో మలయాళం స్టార్ హీరో నటిస్తున్నాడా..?