విజయ దశమి ప్రాముఖ్యత గురించి తెలుసా..?

మన దేశ వ్యాప్తంగా ప్రజలందరూ దసరా పండుగను ఎంతో కోలాహలంగా జరుపుకుంటారు.దసరా పండుగను విజయదశమి( Vijayadashami ) అని కూడా పిలుస్తారు.

ఒకప్పుడు లోకాలను పట్టిపీడిస్తున్న బండాసురుడు అనే రాక్షసుడిని ఆదిశక్తి అవలీలగా వధించిన రోజునే దసరా పండుగను జరుపుకుంటారు.

ఇంకా చెప్పాలంటే రాముడు రావణుడి పీడను వదిలించిన రోజుగా ముల్లోకాలు ఆనందంతో పండుగ చేసుకునే రోజుగా దసరాను జరుపుకుంటారు.

అలాగే చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీన్ని విజయదశమి అని కూడా అంటారు.

రాముడు రావణుడి పై దండెత్తి వెళ్లి విజయం సాధించిన రోజు ఇదే కావడంతో రావణుడి దిష్టిబొమ్మను తగలబెట్టే సంప్రదాయం కూడా ప్రారంభమైంది.

"""/" / రావణ దహనం వెనుక మరో అర్థం కూడా ఉంది.పరస్త్రీ వ్యామోహంలో పడినవారు, వేధింపులకు గురి చేసే వారు, ఏదో ఒక రోజు పాపం నుంచి దహించుకుపోతారనే సందేశం కూడా ఉంది.

అందుకే మనిషిలో కామ, క్షోధ, మద, మత్సర్యాలను నశింప చేసుకోవాలని రావణ దహనం సందేశం ఇస్తుంది.

ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి ఆశ్వయుజ శుద్ధ నావమి వరకు 9 రోజులు దేవీ నవరాత్రులు( Navratri ) పదవరోజు విజయదశమి కలిసి దసరా అని పిలుస్తారు.

దేవాలయంలో అమ్మవారిని తొమ్మిది రూపాయల్లో పూజిస్తూ ఉంటారు.అమ్మవారు ఒక్కో రోజు ఒక్క రూపాన్ని ధరిస్తారు.

అమ్మవారు అవతరించిన రోజున ఆ రూపంతో అమ్మవారిని అలంకరించి ఆ నామంతో ఆరాధిస్తూ ఉంటారు.

"""/" / దసరా రోజు జమ్మి ఆకులను( Jammi Chettu ) పూజించి ఆ తర్వాత పంచుకుంటారని దాదాపు చాలామందికి తెలుసు.

మహాభారతంలో పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు తమ ఆయుధాలను ఒక మూటలో ఉంచి శమీ వృక్షంపై ఉంచారు.

తమ ఆయుధాలను జాగ్రత్తగా కాపాడమని శమీ వృక్షాన్ని కోరి నమస్కరించి వెళ్తారు.అజ్ఞాతవాసం పూర్తయిన తర్వాత జమ్మి చెట్టు వద్దకు వచ్చి పాండవులు శమీ వృక్షానికి పూజ చేసి తమ ఆయుధాలను తీసుకుంటారు.

ఆ తర్వాత కౌరవులతో యుద్ధంలో పాల్గొని వారిని ఓడిస్తారు.అప్పటినుంచి విజయదశమి రోజున శమీ వృక్షాన్ని పూజిస్తే ఓటమి ఉండదని చాలామంది ప్రజలు నమ్ముతారు.

మణిరత్నం చేసిన ఆ సూపర్ హిట్ సినిమాలో మంచి ఛాన్స్ ను మిస్ చేసుకున్న నందమూరి బ్రహ్మిని…