దశరథ మహారాజుకు ఐదవ సంతానం ఉందని మీకు తెలుసా?

దశరథ రాజుకు నలుగురు పిల్లలు ఉన్నారని, వారిలో శ్రీరాముడు పెద్దవాడని ఈనాటి వరకూ వింటూనే ఉన్నాం.

కానీ వాస్తవానికి దశరథ మహారాజు ఐదుగురు పిల్లలకు తండ్రి.అతని ఐదవ సంతానం గురించి వాల్మీకి రామాయణంలో లేదా రామచరితమానస్‌లో ప్రస్తావించలేదు.

కానీ దక్షిణ భారతదేశంలో కనిపించే రామాయణ కథలో, దశరథ రాజుకు గల ఐదవ సంతానం గురించి ప్రస్తావించారు.

ఆ రామాయణ కథనం ప్రకారం, దశరథ మహారాజుకు ముందుగా కుమార్తె జన్మించింది.ఆమె రాముడి కంటే పెద్దది.

ఆమె పేరు శాంతా దేవి.ఆమె దశరథ మహారాజు , కౌసల్యల కుమార్తె.

ఆమె హిమాచల్ ప్రదేశ్‌లోని కులు నుండి 50 కి.మీ దూరంలో ఒక దేవాలయంలో కొలువైవుంది.

ఆమె తన భర్తతో పాటు పూజలందుకుంటోంది.దశరథ మహారాజు కుమార్తెకు సంబంధించిన ఈ కథను ఇప్పుడు తెలుసుకుందాం.

పురాణాల ప్రకారం దశరథ రాజు కుమార్తె శాంతా దేవి జన్మించినప్పుడు అయోధ్యలో కరువు వచ్చింది.

12 సంవత్సరాల పాటు కరువు వచ్చింది.దీంతో ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

అప్పుడు దశరథ మహారాజుతో అతని కుమార్తె శాంతను ఎవరికైనా దానం చేస్తే దుర్భిక్ష పరిస్థితిని నివారించవచ్చని పండితులు సలహా ఇచ్చాడు.

ప్రజాక్షేమం కోసం దశరథ మహారాజు.అంగదేశ రాజు రోమపాదుడు, వర్షిణిలకు తమ కుమార్తెను దానం చేశాడు.

వర్షిణి మాత కౌసల్య సోదరి.రాజు రోమపాదుడు, వర్షిణిలు శాంతను చాలా ప్రేమగా పెంచారు.

శాంతను అంగదేశ యువరాణి అని పిలుస్తారు.ఆమె పెరిగి పెద్దయ్యాక, శృంగి రిషిని వివాహం చేసుకుంది.

అయోధ్యను విడిచిపెట్టిన శాంత తిరిగి అక్కడికి రాలేదని పురాణాలు చెబుతున్నాయి.ఈమె రోమపాదుని కుమార్తెగా ప్రసిద్ధి చెందింది.

ఈ కారణంగానే దశరథ మహారాజు 4 మంది కుమారులు అని చెబుతారు ఇందులో శ్రీరాముడిని పెద్దవాడు అని పిలుస్తారు.

కులు నుండి 50 కి.మీ దూరంలో శాంతా దేవి ఆలయం ఇప్పటికీ ఉంది.

అక్కడ ఆమె భర్త శృంగి రిషితో పాటు విగ్రహాల రూపంలో పూజలు అందుకుంటోంది.

మాతా శాంతా దేవి, శృంగి ఋషికి పూజలు చేయడానికి సుదూర ప్రాంతాల నుండి భక్తులు ఇక్కడకు వస్తుంటారు.

ఇక్కడ శాంతాదేవిని పూజించడం ద్వారా శ్రీరాముని అనుగ్రహం కూడా లభిస్తుందని, హృదయపూర్వకంగా కోరిన ప్రతీ కోరిక నెరవేరుతుందని స్థానికులు చెబుతుంటారు.