Singer Dekshitha : ‘చమ్కీల అంగీలేసి’ పాట పాడిన ఈ సింగర్ ఎవరో తెలిస్తే..!

సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా చంకీల అంగిలేసి అంటూ దసరా మూవీ నుంచి వచ్చిన ఈ పాట వైరల్ గా మారింది.

నాని కీర్తి సురేష్ జంటగా నటించిన సినిమా దసరా( Dasara ) ఈ సినిమా మరికొన్ని రోజుల్లో విడుదల అవుతుండగా దానికి ముందే కొన్ని బాధలను విడుదల చేసింది సినిమా యూనిట్.

అందులో చంకీల అంగిలేసి అనే పాట బాగా వైరల్ గా మారడంతో ఈ పాట పాడిన సింగర్స్ ఎవరు అని సోషల్ మీడియాలో బాగా వెతుకుతున్నారు.

అయితే ఈ పాట పాడిన వారిలో మేల్ సింగర్ రామ్ మిరియాల మనకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి.

ఇక ఫిమేల్ సింగర్ విషయానికి వస్తే ఈ పాట పాడిన అమ్మాయి పేరు దీక్షిత అలియాస్ దీ ది( Singer Dhee ) చాలా రోజులుగా పాట పాడుతున్నప్పటికీ దీక్షిత కు తెలుగులో ఈ రేంజ్ లో ఒక పాట వైరల్ కావడం ఇదే మొదటిసారి.

"""/" / మొన్నటికి మొన్న హీరో సూర్య నటించిన ఆకాశమే హద్దురా( Aakaasam Nee Haddhu Ra ) అనే చిత్రంలో సైతం కాటుక కనులే అనే పాట పాడింది దీక్షిత.

ఈ పాట ఆమెకు మంచి పేరుని తీసుకొచ్చింది.సంచలన రికార్డులు నమోదు చేసిన రౌడీ బేబీ పాట కూడా దీక్షిత పాడింది కావడం విశేషం అలాగే దీక్షిత తన 14 వ ఏట నుంచి పాటలు పాడడం ప్రారంభించింది.

సంచలన సంగీత దర్శకుడు అయిన సంతోష్ నారాయణ కూతురే ఈ సింగర్ దీక్షిత.

దసరా సినిమాకి సంతోష్ నారాయణ సంగీతం అందిస్తున్నారు కాబట్టి తన కూతురితో ఒక పాట పాడించారు.

అలాగే ఆమె గొంతు ఇప్పటికే చాలా మందికి తెలుసు కాబట్టి ఆమె ఈ పాటకు చక్కగా న్యాయం చేసింది.

"""/" / మొట్టమొదట గా ఏ అర్ రెహమాన్ తో తన ఆల్బమ్ నీ రూపొందించి అందరి ప్రశంసలు అందుకుంది.

తమిళ మాతృ బాషా అయినప్పటికీ తెలంగాణ భాషలో ఉన్న ఇంత క్లిష్టమైన పదాలను పలకడంతో దీక్షిత ప్రస్తుతం తమిళనాడు తో పాటు తెలుగులో కూడా బాగా వైరల్ గా మారుతుంది.

హీరోయిన్స్ కన్నా అందంగా ఉన్న దీక్షిత ఇంత అందమైన పాటను ఎంతో అందంగా పాడటం వల్లే ప్రస్తుతం తెలుగులో అందరూ ఆమె పేరు నామస్మరణ చేస్తున్నారు.

ఇక పాష్ లుక్స్ తో దీక్షిత అద్భుతంగా ఉంది.అమే ప్రొఫైల్ నీ మీరు కూడా కూడా ఒక లుక్ వేయండి.

అతి త్వరలో దీక్షిత హీరోయిన్ అయిన ఆశ్చర్య పోనక్కర్లేదు.

ప్రభాస్ కి అసలైన పోటీ ఇచ్చే స్టార్ హీరోలు వీళ్లేనా..?