ఆర్ ఆర్ ఆర్ లో నాటు నాటు స్టెప్పులేసిన నటుడి గురించి తెలుసా?
TeluguStop.com
ఇండియన్ సినిమాను ఒక స్థాయికి తీసుకు వెళ్లి నిలబెట్టిన ఘనత ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళికి దక్కింది.
చిన్న డైరెక్టర్ నుండి నేడు పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కించే వరకు వెళ్లిన రాజమౌళి ఇప్పుడు ఇండియన్ ప్రముఖ డైరెక్టర్ లలో ఒకరిగా నిలిచారు.
బాహుబలి సిరీస్ లాంటి కల్పిత కథ తర్వాత ఆర్ ఆర్ ఆర్ లాంటి చారిత్రాత్మకమైన సినిమాను తెరకెక్కించాడు.
ఈ సినిమా అనౌన్స్ చేసిన క్షణం నుండి విడుదల అయ్యే వరకు ప్రపంచం మొత్తం ఎదురుచూసింది.
మధ్యలో రెండు మూడు సార్లు ఈ సినిమాను విడుదల చేయాలనీ చూసినా కరోనా కారణంగా అది నోచుకోలేదు.
అయితే ఎట్టకేలకు మార్చి 25 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలయింది.విడుదలయిన రోజు నుండి నేటి వరకు కూడా కలెక్షన్ లు ఏ మాత్రం తగ్గకుండా మరిన్ని రికార్డులను బద్దలు కొట్టే దిశగా వెళుతోంది.
"""/" /
ఈ సినిమాలో ప్రధాన పాత్రలలో జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లు అద్భుతంగా నటించి సినిమా విజయంలో కీలక పాత్ర పోషించారు.
ఇక వీరిద్దరి సరసన హాలీవుడ్ నటి ఒలీవియా మరియు అలియా భట్ లు నటించారు.
ఈ సినిమాలో ప్రతి ఒక్క సన్నివేశం, పాటలు, పోరాట సన్నివేశాలు అన్నీ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
అయితే ఈ సినిమా ప్రథమార్ధంలో వచ్చే నాటు నాటు సాంగ్ ఎంతటి ప్రాముఖ్యతను సంతరించుకుందో తెలిసిందే.
ఎవరి నోట విన్నా ఈ పాటే వినిపిస్తోంది.ఈ పాటలో ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లు డ్యాన్స్ చూడముచ్చటగా ఉంటుంది.
అయితే డ్యాన్స్ గురించి బ్రిటిషర్ వీరిద్దరినీ హేళన చేసి మాట్లాడుతాడు.ఆ సందర్భంలో వీరిద్దరూ కలిసి నాటు నాటు అంటూ ఊపందుకుంటారు.
"""/" /
ఆ స్టెప్పులతో తెలుగు వారి నాటు పవర్ ఏంటో చూపించారు.
అయితే ఈ పాటలో వీరిద్దరితో కలిసి స్టెప్పులు వేసిన హాలీవుడ్ నటుడు జేక్ గురించి తెలియని కొన్ని ముఖ్యమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అయితే ఇతను ఆ ఒక్క పాటలో మినహా మరే సన్నివేశంలోనూ కనిపించడు.ఇతని పూర్తి పేరు ఎడ్వర్డ్ బుహక్.
ఇతను ఏంటో కాలంగా నటుడిగా కొనసాగుతున్నాడు.ఎడ్వర్డ్ తన నటన ప్రస్థానాన్ని 1995 వ సంవత్సరంలో టీవీ ద్వారా ప్రారంభించాడు.
ఎక్కువగా టీవీ షోలలో తన నటనను ప్రదర్శించాడు.ఎడ్వర్డ్ కొన్ని సేవాకార్యక్రమాలు కూడా చేస్తుండేవాడు.
ఎక్కువగా సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటూ పలు ఉపయోగకరమైన పోస్ట్ లను షేర్ చేస్తూ ఉంటాడు.
ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు గానూ ఇటీవల ఎడ్వర్డ్ ఇంస్టా గ్రామ్ వేదికగా ఆర్ ఆర్ ఆర్ డైరెక్టర్ రాజమౌళికి థాంక్స్ చెప్పాడు.
ముందు ముందు ఎడ్వర్డ్ కు తెలుగులో అవకాశాలు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
బన్నీపై నాకెందుకు కోపం.. వాళ్లు నాతో తిరిగినవాళ్లే.. రేవంత్ రెడ్డి కామెంట్స్ వైరల్!