లక్ష్మి పార్వతి ఆధీనంలో ఉన్న ఎన్టీఆర్ మ్యూజియం గురించి మీకు తెలుసా ?

ఎన్టీఆర్ కి పౌరాణిక సినిమాలు అంటే ఎంత ప్రాణమో అందరికీ తెలిసిందే.అందుకే తాను పోషించిన పౌరాణిక పాత్రలకు సంబంధించిన దుస్తులు.

, గదలు, ఆభరణాలు ఇచ్చాదుల్ని సేకరించి భద్రపరిచారు.ఎన్టీఆర్ ఆయన రెండవ సతి మణి అయినా లక్ష్మీపార్వతి ఆధీనంలో ఉన్న మ్యూజియంలోని ఈ ఆభరణాలను తెలుగు సినిమా వజ్రోత్సవంలో ప్రదర్శించారు.

ఈ సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకులు అందరూ ఈ ఆభరణాలను సందర్శించి ఎన్టీఆర్ తో తమకున్న అనుబంధాన్ని నెమరు వేసుకోవడం సినీ ప్రియులను పులకరింపజేసిన సంఘటనగా చెప్పుకోవచ్చు.

తాను పోషించిన పౌరాణిక సినిమాలలోని ఆభరణాలను సేకరించాలని ఆసక్తి ఎన్టీఆర్ కి ఎందుకు కలిగింది అనే విషయాన్ని ఓ సందర్భంగా ఆయన వెల్లడించారు.

"""/" / 1955లో అనుకుంటాను.జై సింహా సినిమాలో ఓ సన్నివేశంలో నేను అర్జున పాత్రలో కనిపిస్తాను.

నా పౌరాణిక పాత్రలకు అది తొలిమెట్టు అని చెప్పాలి.ఎందుకంటే ఆ పాత్ర ధరించిన తర్వాతే పూర్తిస్థాయి పౌరాణిక చిత్రం చేయాలన్న కోరిక నాలో కరిగింది.

పౌరాణిక పాత్రలు ధరించి కాస్త గుర్తింపు వచ్చాక వాటిపై స్పెషల్ గా ఏదైనా చేయాలని ఆలోచన కలిగింది.

అదే నా పరిశోధనకు నాంది పలికి ఆనాటి నుంచి ఆయన సినిమాలు నటించడం ఆపేసే దాకా ఎంతో మంది కళా దర్శకులు అద్భుతంగా రూపొందించిన ఆభరణాలను, కిరీటాలను కేభద్రపరుస్తూ వచ్చానని ఎన్టీఆర్ చెప్పారు.

ఇక అందులో కొన్నింటిని తానే దగ్గర రూపొందించుకున్నానని జాగ్రత్త చేసి ముందు తరాలకు అందించకపోతే నా అభిరుచి వారికి ఎలా తెలుస్తుంది అ నిఅందుకే వాటిని పదిల పరచాలని చెప్పారు.

"""/" / కంటికి రెప్పలా వాటిని కాపాడుకుంటూ వచ్చానని వాటిని చూస్తున్నప్పుడు ఒక్కో కిరీటం, ఒక్కో గద తనలోని కళాకారున్ని తట్టి లేపుతుందని, తనను తన్మయానికి గురి చేస్తుందని, ఖరీదు కట్టలేని ఈ అపురూప ఆభరణాలను చూస్తుంటే ఆనాటి పౌరాణిక వైభవం ఒక్కసారి కళ్ళల్లో అలా కదలాడుతుందంటూ ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.

ఇక పౌరాణికం పేరు చెప్పగానే ఆయన పోషించిన కృష్ణుడి పాత్ర అందరిలో కళ్ళముందే కదలాడుతుంది.

కానీ అవి మళ్లి ఎప్పుడు జనాల ముందుకు తెస్తారో కానీ అందరు చూడటానికి మాత్రం అనుమతి లేదు అనే చెప్పాలి.

అల్లు అర్జున్ పేరుతో ఫేక్ పోస్ట్ వైరల్.. నాగబాబును అలా బండబూతులు తిట్టాడంటూ?