మనస్సంకల్పాన్నిచ్చే మానసా దేవి గురించి మీకు తెలుసా?

మనసా, వాచా, కర్మణా.అంటారు.

ఏ మహత్కార్యాన్ని సాధించాలన్నా ముందు మానసికంగా బలంగా ఉండాలంటారు.అలాంటి గట్టి మనస్సంకల్పానికి ప్రతీక మానసా దేవి.

సర్పజాతి నియమాలు, నియంత్రణ ఆమె లక్ష్యాలైనా జ్ఞానసాధన కోసం పట్టుదలతో అద్వితీయమైన కృషి చేసింది.

ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయంగా నిలిచింది.సర్ప జాతికి అధి దేవతగా కశ్యప మహాముని ఈమెను సృష్టించాడని పురాణాలు చెబుతున్నాయి.

తన జాతి సంరక్షణ ఆధ్యాత్మిక జ్ఞానంతోనే సాధించవచ్చని భావించిన ఆమె అందు కోసం కఠోరమైన తపస్సు చేసింది.

శివుడి అనుగ్రహం కోసం తన పదహారవ ఏట నుంచి మూడున్నర యుగాల తపస్సు చేస్తూనే ఉంది.

తను యవ్వన ప్రాయంలో స్వాభావికమైన అనేక కోరికలను నియంత్రించుకుని కఠిన నియమాలను పాటించింది.

పురుషుడి ఆలోచనను కూడా దగ్గరకు రానీయకుండా తపస్సు చేసింది.ఆమె తపస్సును మెచ్చి శంకరుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమంటాడు.

అలా మానసా దేవి మృత సంజీవని విద్యను సాధించింది.సర్ప జాతికి మాతృ సమానురాలైనా విష స్వభావాన్ని వదిలేసి ఎందరికో ప్రాణ దానం చేసింది.

పాల సముద్ర మథనంలో పుట్టిన హాలాహలంలో అర్ధభాగాన్ని శివునితో పాటు తానూ స్వీకరించి మొత్తం విశ్వానికి మేలు చేసింది.

పట్టుదల, త్యాగాలతో జ్ఞానాన్ని, అమృతత్వాన్ని, దైవత్వాన్ని సాధించవచ్చని నిరూపించింది.సర్ప దోషాల నివారణ కోసం, సంతానం కోసం ఆమెను పూజించాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతుంటారు.

ఈమె పూజను మనః పూర్వకంగా చేసిన వారికి సత్ఫలితాలు కలుగుతాయని నమ్ముతారు.

పైనాపిల్ ఆరోగ్యాన్నే కాదు జుట్టును కూడా ఒత్తుగా పెంచుతుంది.. ఎలా వాడాలంటే?