చిరంజీవి బర్త్ డే సెంటిమెంట్ ఏంటో తెలుసా?
TeluguStop.com
మనలో చాలా మందికి సెంటిమెంట్స్ ఉంటాయి.అయితే ఈ సెంటిమెంట్స్ ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటాయి.
కొందరు కొన్ని రోజుల్లోనే పనులు మొదలు పెడతారు.మరికొందరు తమ బర్త్ డే రోజున మంచి పనులకు శ్రీకారం చుడతారు.
ఇంకొంత మంది ఆయా పండుగల రోజు అనుకున్న పనులను మొదలు పెడతారు.మరికొంత మందికి నెంబర్స్ పట్ల సెంటిమెంట్ ఉంటుంది.
అలాగే మెగాస్టార్ చిరంజీవికి కూడా ఓ సెంటిమెంట్ ఉంది.తన బర్త డే రోజు తను నటించిన ఏ సినిమా కూడా విడుదల చేయడు.
ఒకే ఒక్కసారి తన పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన తన మూవీ ఫ్లాప్ అయ్యింది.
అప్పటి నుంచి చిరంజీవి ఈ సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడు.చిరంజీవి కెరీర్ లో ఆయన పుట్టిన రోజు అయిన ఆగస్టు 22న విడుదలైన ఒకే ఒక్క సినిమా చంటబ్బాయ్.
అంతేకాదు.జంధ్యాల దర్శకత్వంలో చిరంజీవి నటించిన ఒకే ఒక్క సినిమా కూడా ఇదే.
ఈ సినిమాను జ్యోతి ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ మీద బుచ్చిరెడ్డి నిర్మించాడు.ప్రముఖ తెలుగు రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన చంటబ్బాయ్ అనే నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు.
ఈ సినిమా తొలి నుంచి చివరి వరకు హాస్యంతో కొనసాగుతుంది.చిరంజీవి కామెడీని బాగా పండించినా.
ఈ సినిమా జనాలను అంతగా ఆకట్టుకోలేకపోయింది.ఈ సినిమాకు జంధ్యాల దర్శకత్వం వహించడంతో పాటు, మాటలు కూడా తనే రాశాడు.
"""/"/ చక్రవర్తి స్వరకల్పనలో వేటూరి సుందర రామ్మూర్తి రాసిన పాటు జనాలను బాగా ఆకట్టుకున్నాయి.
ఈ సినిమాలో చిరంజీవి చార్లీ చాప్లిన్ గెటప్ లో కనిపించి వారెవ్వా అనిపించాడు.
అంతేకాదు.అట్లాంటి ఇట్లాంటి హీరోని కాను నేను అనే పాట జనాలను విపరీతంగా ఆకట్టుకుంది.
చిరంజీవి అప్పట్లో సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగుతున్నాడు.ఆ సమయంలో చంటబ్బాయ్ లాంటి కామెడీ సినిమా చేయడంతో జనాలు రిసీవ్ చేసుకోలేకపోయారు.
ఈ సినిమా తర్వాత తన బర్త్ డే రోజు మరే సినిమా రిలీజ్ కాకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు చిరంజీవి.
వర్సిటీ క్యాంపస్‌లో లోదుస్తులతో విద్యార్థిని నిరసన.. మ్యాటరేంటంటే?