పూజారులుగా స్త్రీలకు ఎందుకు అవకాశం ఇవ్వరో తెలుసా?

మన హిందూ సంప్రదాయాలా ప్రకారం మనకు ముక్కోటి దేవుళ్లు ఉన్నారు.అయితే మనకు తెలిసినంత వరకు ఆ గుడులకు పూజారులుగా కేవలం పురుషులను మాత్రమే నియమిస్తుంటారు.

అయితే ఎక్కడ చూసినా వారు మాత్రమే మనకు పూజారులుగా కనిపిస్తుంటారు.అయితే చాలా మందికి పురుషులను మాత్రమే గుడి పూజారులుగా ఎందుకు నియమిస్తారనే ఆలోచన వస్తుంటుంది.

కానీ సమాధానం తెలియదు, బయటకు అడగలేక అలాగే ఉండిపోతారు.అయితే స్త్రీలను పూజారులుగా ఎందుకు నియమించరో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

దేవుడి రూపమైన విగ్రహాలకి మంత్ర, యంత్రాలతో ప్రతిష్ట జరిగాక అవి అనంతమైన శక్తిని పొందుతాయి.

సాక్షాత్తు దైవ స్వరూప అంశ ఆ విగ్రహానికి వస్తుంది.నిత్యం దీప, ధూప నైవేద్యాలు తప్పని సరిగా ఉంటాయి.

మడి, ఆచారం కచ్చితంగా పాటించాలి.అయితే స్త్రీలలో ప్రకృతి  సహజంగా దూరంగా ఉండాల్సిన రోజులు కొన్ని ఉంటాయి.

అయితే ఏ సమయంలో అలా జరుగుతుందో స్త్రీలకే తెలియదు.అటువంటప్పుడు దేవాలయాల్లో వారు పూజారులుగా ఉండి పూజలను నిర్వహిస్తుంటే దైవదోషం అవుతుంది.

మళ్లీ ఎన్నో శుద్ధ ప్రక్రియలు చేయాలి.అందుకే దేవాలయాల్లో స్త్రీలను పూజారులుగా ఉంచరు.

అంతే కాదు గుడిని శుభ్ర పరిచేందుకు కూడా స్త్రీలను అనుమతించరు.గుడికి సంబంధించిన అన్ని పనులను పురుషులకే అప్పగిస్తుంటారు.

అయితే ఆలయ ఈవోలుగా మాత్రం ఆడ వారికి అనుమతి ఇస్తుంటారు.ఎందుకంటే ఆమె ప్రతిరోజూ గుడికి రావాల్సిన అవసరం లేదు కాబట్టి.

ఒకవేళ రావాల్సిన వచ్చిన మైల పడినన్ని రోజులు రాకుండా ఆ తర్వాత పనులు చేసుకుంటారు.

బాలయ్య తో కామెడీ సినిమా చేయాలనుకున్న స్టార్ డైరెక్టర్.. అది ఎలా మిస్ అయిందంటే..?