అలర్ట్: మీకు రెండు జీమెయిల్ అకౌంట్స్ ఉన్నాయా..? అయితే ఈ విషయాలు తెలుసుకోండి.!

స్మార్ట్ ఫోన్ ఉపయోగించే ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా జీమెయిల్ లేదా గూగుల్ అకౌంట్ కలిగి ఉండడం తప్పనిసరి.

ఒకవేళ జీమెయిల్ అకౌంట్ లేకపోతే యూట్యూబ్‌, గూగుల్ ప్లే, గూగుల్ డ్రైవ్ వంటి ఏ ఇతర గూగుల్ యాప్స్ పని చేయవు.

ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఫోన్ వాడెవారు తప్పనిసరిగా గూగుల్ అకౌంట్ ఓపెన్ చేయాలిసిందే.ఈ క్రమంలోనే చాలా మంది కేవలం ఒక్క గూగుల్ అకౌంట్‌ తోనే అన్ని సేవలను ఉపయోగిస్తున్నారు.

కానీ ఇలా ఒక్క గూగుల్ అకౌంట్ ను ఉపయోగించడం సరికాదని అంటున్నారు నిపుణులు.

ఎందుకంటే ఒకే ఒక గూగుల్ అకౌంట్ ఉపయోగించడం వలన ఆ అకౌంట్ యొక్క పాస్‌వర్డ్ మర్చిపోయినా గాని లేదంటే ఆ అకౌంట్ ను ఎవరయినా హ్యాక్ చేసినాగాని మీ ఫోన్ లోని విలువైన సమాచారం అంతా పోతుంది.

అందుకనే సేఫ్టీ కోసం మరొక సెకండరీ అకౌంట్‌ ఓపెన్ చేసుకోవడం మంచిది అంటున్నారు నిపుణులు.

మరి ఈ సెకండరి గూగుల్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి, దాని వలన కలిగే ఉపయోగాలు ఏంటినే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

"""/"/ నిజానికి మీ ఫోన్ లో గూగుల్ అకౌంట్‌ ను క్రియేట్ చేయడానికి చాలా తక్కువ సమయమే పడుతుంది.

అలాగే ఈ సెకండరి అకౌంట్ వలన 15జీబీ డేటా క్లౌడ్ ను స్టోరేజ్ చేసుకోవచ్చు.

అలాగే ఈ స్టోరేజ్ లో మీ ఫొటోలు, ఇతర ఫైల్‌లను స్టోర్ చేసుకోవచ్చు.

అయితే మీ ఫోన్ లోని డేటాను బ్యాకప్ చేసుకోవడానికి దీన్ని తరచూ వాడుతూ ఉండటం ముఖ్యం.

ఇతర సర్వీసులు యాక్సెస్ చేయడానికి అప్పుడప్పుడు సెకండరి అకౌంట్ యూస్ చేయడం వలన స్పామ్ ఈమెయిల్స్ సంఖ్య తగ్గించవచ్చు.

అలాగే ప్రతి ఒక్క ఆండ్రాయిడ్ యూజర్ కూడా అదనంగా ఒక ఆల్టర్నేటివ్ గూగుల్ అకౌంట్‌ను కలిగి ఉంటే చాలా మంచిది.

రికవరి సమయంలో సెకండరి మెయిల్ మిమ్మల్ని సేవ్ చేస్తుంది. """/"/ మరి ఎలా సెకండరి అకౌంట్ ఓపెన్ చేయాలో అనే విషయం తెలుసుకుందామా.

ముందుగా మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో సెట్టింగ్స్ ఓపెన్ చేసి అందులో గల గూగుల్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

ఆ తరువాత మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ పై నొక్కి మళ్ళీ సెక్యూరిటీ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.

ఇప్పుడు 'ఎస్ వీ కెన్ వెరిఫై ఇట్స్ యు' అనే సెక్షన్‌ కింద ఉండే రికవరీ సెక్షన్‌లో మీరు క్రియేట్ చేసుకున్న రెండో అకౌంట్ ను జత చేయడమే.

ఒకవేళ ఎట్టి పరిస్థితులలో అయిన మీ ఖాతా హ్యాక్‌కు గురైనాగాని లేదా మీ రిజిస్టర్డ్ ఫోన్ నంబర్‌కు నెట్‌వర్క్ సరిగా అందనప్పుడు గాని మీ రెండో గూగుల్ ఖాతాను ఉపయోగించుకోవచ్చు.

అలాగే పాస్‌వర్డ్ లేనిదే ఎవరు కూడా మీ రెండో ఈమెయిల్ ఐడీని డిలీట్ చేయలేరు కాబట్టి ఈ రెండో మెయిల్ అనేది మీ ఫోన్ రికవరీకి బాగా ఉపయోగపడుతుంది.

Shankar , Rajinikanth : శంకర్ చెప్పిన రెండు అద్భుతమైన కథలను రిజెక్ట్ చేసిన రజినీకాంత్.. ఆ సినిమాలు ఏంటి..?