ఈ అలవాట్లు మీలో ఉన్నాయా.. వెంటనే మానుకోండి పొరపాటున కూడా ఇవి చేయకూడదు!
TeluguStop.com
సాధారణంగా మనం నిత్య జీవితంలో మనకు తెలియకుండానే ఎన్నో పొరపాట్లు చేస్తుంటారు.అలాగే మన జీవితంలో మనకు ఉన్న అలవాటు కారణంగా ఎన్నో పొరపాట్లు చేస్తుంటాం అయితే అలాంటి వాటి గురించి మనం పెద్దగా పట్టించుకోము.
కానీ ఇలాంటి పొరపాట్లు వల్ల మనం ఎన్నో ప్రమాదాలను ఎదుర్కోవలసి వస్తుంది.ఈ పొరపాట్లకు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది.
అందుకే పొరపాటున కూడా కొన్ని పనులను మనం చేయకూడదు.బహుశా అలాంటి అలవాటు కనుక ఉంటే వెంటనే వాటిని మానుకోవడం ఎంతో ఉత్తమం.
మరి ఆ అలవాట్లు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.మంచం పై కూర్చొని భోజనం చేసే అలవాటు చాలామందికి ఉంటుంది.
నిజానికి ఇది ఒక చెడ్డ పరిణామం.మంచంపై భోజనం చేయడం వల్ల సకల వ్యాధులు మనల్ని చుట్టుముడతాయి.
అలాగే కుటుంబ సభ్యులను అశాంతిగా ఉంచడం, కుటుంబం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది కనుక శాస్త్రం ప్రకారం అనారోగ్య సమస్యలతో బాధపడే వారు మినహా మిగిలిన వారేవరు మంచం పై కూర్చుని భోజనం చెయ్యకూడదు.
అదేవిధంగా చాలామంది వంట గదిలో ఉదయం నుంచి వంట చేసి తిన్న పాత్రలన్నింటినీ అలాగే ఉంచుతారు.
అన్ని ఒకసారి శుభ్రం చేసుకోవచ్చన్న ఉద్దేశంతో రోజంతా అలాగే ఎంగిలి గిన్నెలను ఇంటిలో ఉంచుతారు.
ఇలా ఉంచడం పరమ దరిద్రం.ఇలా ఉంచడం వల్ల మన ఇంట్లో ప్రతికూల వాతావరణం ఏర్పడి కుటుంబ సభ్యులను ఆందోళనలోకి నెట్టేస్తుంది.
అదేవిధంగా రాత్రి పడుకునే ముందు వంటగదిలో బాత్రూంలో ఒక బకెట్ నిండా నీళ్లు పెట్టడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి సంతృప్తి చెంది మనకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా కాపాడుతుంది.
ఇక సూర్యాస్తమయం తర్వాత పొరపాటున కూడా పక్కవారికి పాలు, పెరుగు, ఉప్పు వంటి పదార్థాలను ఇవ్వకూడదు.
ఓరి దేవుడా.. 8 కేజీల బిర్యానీ ఎలా తినేశావేంటి సామీ! వీడియో వైరల్