మీకు పెట్ డాగ్ ఉందా..?! ఇలా మీరు చేయకపోతే 50 వేల రూపాయిల ఫైన్..!

మీ ఇంట్లో పెంపుడు జంతువులను పెంచుకుంటున్నారా.? అయితే మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి.

ఎందుకంటే ఇక మీదట మీరు పెంపుడు జంతువులను పెంచుకోవడం అంత ఈజీ కాదు.

మరి ముఖ్యంగా హైదరాబాద్ లో ఉండేవారు అయితే తమ పెంపుడు జంతువులను ఇకమీదట రిజిస్ట్రేషన్ చేసుకోవాలట.

అలా రిజిస్ట్రేషన్ చేసుకోని జంతువుల యజమానులకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) ఫైన్ విధించనుంది.

పెంపుడు జంతువుల విషయంలో GHMC పెట్టిన నిబంధనలను ఉల్లంగిస్తే వారికి రూ.50,000 వరకు జరిమానా విధించనుంది.

ఇదిలా ఉండగా మొదటి దశలో పెంపుడు కుక్కలకు మాత్రమే రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా వర్తిస్తుంది.

వాటిల్లో పిల్లుల లాంటి ఇతర పెంపుడు జంతువులకు మినహాయింపు ఉంటుంది.ఒకవేళ రిజిస్ట్రేషన్ కాని పెంపుడు జంతువులను బయట ప్రదేశాలకు తీసుకువెళితే ఆయా పెంపుడు జంతువుల యజమానులు త్వరలో ఫైన్ కట్టాలిసి వస్తుందని అధికారులు తెలియజేసారు.

అలా రిజిస్టర్ కాని పెంపుడు జంతువులను బయట పార్కులలో, వీధులలోకి తీసుకువెళితే ప్రజల భద్రతకు ముప్పు వాటిల్లుతుందని పౌర అధికారులు చెబుతున్నారు.

రిజిస్ట్రేషన్ చేయించకుండా పెంపుడు జంతువులను బహిరంగ ప్రదేశాలకు తీసుకుని వెళితే పెనాల్టీ తప్పనిసరి ఆ పెనాల్టీ చెల్లించిన తర్వాత మాత్రమే యజమానులు తమ పెంపుడు జంతువులను తిరిగి పొందవచ్చు.

నగరంలో ప్రస్తుతం 50,000 పెంపుడు కుక్కలు ఉన్నాయని వాటిలో కేవలం 465 పెట్ డాగ్స్ కు మాత్రమే రిజిస్ట్రేషన్ ఉందని అధికారుల అంచనా.

"""/"/ఇలా పెంపుడు జంతువుల నమోదు వలన ఎవరి ఇంట్లో ఎన్ని డాగ్స్ ఉన్నాయి.

? ఎలాంటి డాగ్స్ ఉన్నాయి.? వాటిని సోసైటికి ఎలా ఇంటరాక్ట్ చేస్తున్నారు.

వాటిని ఎలా చూసుకుంటున్నారనే విషయాల పట్ల ప్రభుత్వానికి ఒక అవగాహన వస్తుంది.అలాగే కుక్కల యజమానులు లైసెన్స్ పొందడంతో పాటు, తమ పెట్ డాగ్స్ కు యాంటీ-రాబిస్ టీకా వేశారా లేదా అనేది రికార్డ్ అవుతుంది.

ఒక్కోసారి కొన్ని కారణాల వలన పెట్స్ ను రోడ్డుపక్కన వదిలేసి వెళ్లిపోతున్నారు.అందుకనే పెంపుడు జంతువులకు లైసెన్సు పొందే ముందు మైక్రోచిప్‌లు అమర్చాలన్నారు.

మైక్రోచిప్‌ తో, GHMC నగరంలో పెంపుడు జంతువుల సంఖ్యను తనిఖీ చేస్తుంది.దీంతో ఒకవేళ వాటిని వదిలేస్తే ఆయా యజమానులను ట్రాక్ చేస్తుంది.

పెంపుడు జంతువుల పట్ల యజమానులు బాధ్యత వహించాలిసి ఉంటుంది. """/"/ఈ రిజిస్ట్రేషన్ కు కూడా మాన్యువల్ రిజిస్ట్రేషన్ కాకుండా, పెంపుడు జంతువుల యజమానులు !--wwwghmc.

Gov!--in కి లాగిన్ అయి రిజిస్ట్రర్ చేయించుకోవచ్చు.లాగిన్ అయ్యాక 'Our Services' విభాగంపై క్లిక్ చేసి, లైసెన్స్ కోసం దరఖాస్తును పూరించడానికి ఎంపికను ఎంచుకోవాలి.

అందులో వివరాలను నమోదు చేయాలి.తదనంతరం, లైసెన్స్ పొందడానికి రూ.

50 చెల్లించాలి.ఆ తరువాత అప్లికేషన్ స్వయంచాలకంగా వెటర్నరీ అసిస్టెంట్ డైరెక్టర్ లేదా డిప్యూటీ డైరెక్టర్‌కు ఫార్వార్డ్ చేయబడుతుంది.

అన్ని ఫార్మాలిటిస్ పూర్తి అయ్యాక లైసెన్స్ జారీ చేయబడుతుంది.

మోస్ట్ వరెస్ట్ కంటెస్టెంట్ విష్ణుప్రియ అంటున్న బిగ్ బాస్ షో ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే?