మీ ఇంట్లో దుష్టశక్తులు ఉన్నాయా.. ఉంటే ఇలా చేయండి..
TeluguStop.com

ఈ భూమి మీద దేవుడు అనేవాడు ఉండి ఉంటే కచ్చితంగా నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా ఉంటుంది.


అందువల్లే కొన్ని ఇంట్లలో తరచూ గొడవలు పడడం, తీవ్రమైన ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు, మానసిక ప్రశాంతత లేకపోవడం వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు.


ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ ఇలాంటి సమస్యలకు కారణమని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని బయటికి పంపడానికి చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే చాలు.
దీనికోసం పెయింటింగ్ అలాగే గీతలు లేకుండా పారదర్శకంగా ఉండే ఒక గాజు గ్లాస్ ని తీసుకోవాలి.
ఈ గ్లాస్ మీద ఎటువంటి వేలిముద్రలు కూడా ఉండకుండా ఉపయోగించి దాన్ని రెండోసారి ఉపయోగించకూడదు.
పారదర్శకంగా ఉండే గాజు గ్లాసు తీసుకొని దానిలో ఒకటో వంతు రాళ్లను వేసి, అందులో రెండు వంతుల వెనిగర్ ను వేసి ఉంచాలి.
ఇంకా మిగిలి ఉన్న ఆ ఖాళీ భాగంలో స్వచ్ఛమైన నీటిని పోసి ఆ గ్లాసును నెమ్మదిగా ఒక పక్క ఉంచి గ్లాసులో నీటిని కదలకుండా చూసుకోవాలి.
నెగటివ్ ఎనర్జీ ప్రభావం ఉందని భావించిన వారు ఈ గ్లాసును ఒక మూలన కదలకుండా ఉంచాలి.
ఈ క్లాసును 24 గంటల పాటు ఎవరికీ కనబడకుండా ఉంచితే మరుసటి రోజు ఆ నీటిలో ఎలాంటి మార్పులు లేకుంటే ఇంట్లో ప్రతికూల శక్తులు లేనట్టే అని భావించవచ్చు.
"""/"/
ఒకవేళ ఆ గ్లాసులోని నీరు ఆకుపచ్చ రంగులో లేదా గ్రే రంగులోకి మారి ఉంటే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉన్నట్లు భావించాలి.
ఆ తర్వాత ఆ నీటిని సింక్ లో పారబోసి గ్లాసును శుభ్రం చేసుకోవాలి.
ఇలా తరచూ చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోయే అవకాశం ఉంది.
అయితే చాలామంది ఇండ్లలో నెగిటివ్ ఎనర్జీ ఎక్కడ ఉందో కనుక్కోవాలని ఎప్పుడూ సందేహబడుతూ ఉంటారు.
అలా కనుక్కోవాలంటే ఇంట్లో తల పైకెత్తి ఏదో ఒక మూలనో చూస్తే నెగిటివ్ ఎనర్జీ ఎక్కడ ఉందో మన మనసుకి తెలిసిపోతుందని నిపుణులు చెబుతున్నారు.
సందీప్ కిషన్ కు పీపుల్ స్టార్ ట్యాగ్.. ట్యాగ్ గురించి హీరో, నిర్మాత రియాక్షన్ ఇదే!