భోజనం చేసిన తర్వాత తల తిరుగుతుందా.. అయితే ఈ సమస్య ఉండవచ్చు..!

సాధారణంగా భోజనం( Meal ) చేసిన తర్వాత కొంతమందికి తల తిరగడం గాని, కళ్ళు తిరగడం కానీ జరుగుతూ ఉంటుంది.

దీన్ని చాలా మంది ప్రజలు "లో బ్లడ్ ప్రెజర్"( Low Blood Pressure ) అయి ఉండొచ్చు అని అనుకుంటూ ఉంటారు.

ముఖ్యంగా చెప్పాలంటే చాలా రోజుల వరకు ఆహారం సరైన సమయానికి తినకపోవడం, రక్తంలో గ్లూకోజ్ స్థాయి తగ్గడం కూడా అందుకు కారణం అవుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కాబట్టి మీరు భోజనం లేదా స్నాక్స్ తిన్న తర్వాత లైట్ గా తలనొప్పి( Headache ) లేదా తల తిరగడం వంటివి మొదలైనప్పుడు ఈ పరిస్థితిని అర్థం చేసుకోవడం కొంచెం తికమకగా ఉంటుంది.

"""/" / లో బ్లడ్ గ్లూకోస్ లెవెల్, లో బ్లడ్ ప్రెషర్, డయాబెటిస్( Diabetes ) వంటి సమస్యలకు తీసుకునే మెడిసిన్( Medicine ) ప్రభావం అధికమైనప్పుడు కూడా ఇలానే జరుగుతూ ఉంటుంది.

ముఖ్యంగా చెప్పాలంటే భోజనం తిన్న తర్వాత తల తిరగడానికి ఇతర కారణాలు కూడా ఉన్నాయి.

ఎక్కువ సేపు ఒకే చోట కూర్చున్న తర్వాత సడన్ గా చాలా ఫాస్ట్ గా పైకి లేవడం వల్ల కూడా ఇలా జరిగే అవకాశాలు ఉన్నాయి.

"""/" / శరీరంలో ఫ్లూయిడ్ లెవెల్స్, బ్లడ్ ఫ్లో లో ఆకస్మిక మార్పుల వల్ల, కాంతి ఎక్కువగా ఉండే లైట్ ల క్రింద తరచూ ఉండవలసి రావడం వల్ల కూడా తలనొప్పి, తల తిరగడం లాంటి సమస్యలు వస్తాయి.

పోస్ట్‌ప్రాండియల్ హైపోటెన్షన్ అనే కండిషన్ కారణంగా భోజనం తర్వాత కళ్ళు లేదా తల తిరగడం వంటివి జరుగుతాయని వైద్యులు చెబుతున్నారు.

"""/" / ఆహారం తిన్న తర్వాత తల కళ్ళు తిరుగుతూ ఉంటే ఇలా చేయండి.

భోజనానికి 30 నిమిషాల ముందు 200 ML నీరు తాగాలి.మీరు ఒకేసారి ఎక్కువ మొత్తంలో తినడం వల్ల లో బీపీ సమస్య( BP Problem ) ఏర్పడుతుంది.

భోజనం చేసిన తర్వాత ఎక్కువగా తల తిరిగితే హైపోటెన్షన్ పరిస్థితిని ఎదుర్కోవడానికి కొంత సేపు కూర్చోవడం లేదా పడుకోవడానికి ప్రయత్నించడం మంచిది.

ముఖ్యంగా చెప్పాలంటే తరచూ శరీరానికి అవసరమైన పోషకాలను అందించే సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం మంచిది.

తల తిరిగే సమస్యలు ఉన్నవారు ఒకసారి డాక్టర్ని కలవడం మంచిది.