ఆహారాన్ని స్పూన్‌తో తింటున్నారా..అయితే ఇవి తెలుసుకోండి!

మారుతున్న కాలానుగుణంగా మనిషి సైతం యాంత్రికంగా మారుతున్నాడు.అలాగే మనుషులు తీసుకునే ఆహార నియమాలూ, ప‌ద్ధుత‌లూ మారుతున్నాయి.

పూర్వం అర‌టి ఆకుల్లో భోజనం చేస్తే ఇప్పుడు స్టీల్‌, పింగాణి ప్లేటుల్లో భోజనం చేస్తున్నారు.

ఇక చేతుల‌తో తీసుకునే భోజ‌నాన్ని స్పూన్ల‌తో తింటున్నారు.పిల్ల‌ల‌కు చిన్న‌ప్ప‌టి నుంచే స్పూన్లతో తిన‌డం అల‌వాటు చేస్తున్నారు.

అయితే స్పూన్ల‌తో ఆహారం తీసుకోవ‌డం ఆరోగ్యానికి మంచిద కాదా అని ఎప్పుడైనా ఆలోచించారా.

అయితే స్పూన్ల‌తో ఆహారాన్ని తీసుకోవ‌డం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు అంటున్నారు.సాధార‌ణంగా స్పూన్ల‌తో ఆహారం తీసుకున్న‌ప్పుడు వేగంగా తినేస్తుంటారు.

ఇలా తిన‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు పెరిగే అవ‌కాశం ఉంటుంది.దాంతో మ‌ధుమేహం వ్యాధి బారిన ప‌డ‌తారు.

అలాగే ఆహారాన్ని వండేటప్పుడు ఎన్నో ప‌దార్థాలు వేస్తుంటారు.అయితే ఆహారాన్ని స్పూన్‌తో తింటే ప్రతిచర్య జరిగి వాటి రుచి దెబ్బ తింటుంది.

"""/"/ ఇక చేత్తో కంటే స్పూన్‌తో తింటే ఆహారాన్ని ఎక్కువ‌గా తీసుకుంటారు.ఇలానే క్ర‌మంగా జ‌రిగితే బ‌రువు పెరిగే అవ‌కాశం ఉంటుంది.

అందుకే స్పూన్ల‌ను ప‌క్క‌న పెట్టి ఇక‌పై చేత్తో ఆహారం తీసుకోమ‌ని నిపుణులు సూచిస్తున్నారు.

చేత్తో ఆహారం తీసుకోవ‌డం వ‌ల్ల బోలెడ‌న్ని హెల్త్ బెనిఫిట్స్ కూడా పొందొచ్చ‌ని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

"""/"/ ముఖ్యంగా చేత్తో ఆహారం తీసుకుంటే నెమ్మ‌దిగా తింటారు, త‌క్కువ‌గా తింటారు.దాంతో బ‌రువు అదుపులో ఉంటుంది.

చేత్తో ఆహారం తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణ వ్య‌వ‌స్థ కూడా చురుగ్గా ప‌ని చేస్తుంది.

ఇక కింద కూర్చుని అర‌టి ఆకులో భోజ‌నం వ‌డ్డించుకుని చేత్తో తింటే ఆరోగ్యానికి మ‌రింత మంచిది.

అయితే చేత్తో ఆహారం తీసుకునే ముందస‌బ్బు, నీటితో శుభ్రంగా చేతుల‌ను క్లీన్ చేసుకోవాలి.

లేదంటే చేతుల ద్వారా క‌డుపులోకి బ్యాక్టీరియా వెళ్లిపోతుంది.దాంతో అనేక అనారోగ్య స‌మ‌స్యలు ఏదుర్కోవాల్సి వ‌స్తుంది.

కూతుర్ని పైలట్‌ను చేసిన తండ్రి.. ఆయన కూడా పైలటే.. ఆమె ఫ్లైట్‌లోనే రిటైర్డ్‌!