ఇదేందయ్యా ఇది: పెళ్లి కారును ఇలా కూడా డెకరాటే చేస్తారా? (వీడియో )
TeluguStop.com
ప్రస్తుత రోజులలో సోషల్ మీడియా వినియోగం సర్వసాధారణమై పోయింది.ఈ క్రమంలో సోషల్ మీడియాలో( Social Media ) పాపులారిటీ కోసం ప్రజలను ఆకట్టుకునే విధంగా అనేక ప్రయత్నాలు చేయడంతో పాటు, వివిధ రకాల సాహసాలు చేస్తూ ఉన్నారు ప్రజలు.
కొంతమంది అందర్నీ ఆకట్టుకోవడానికి వారు చేసే విచిత్ర పనులు అందరిని ఆశ్చర్యాన్ని కలిగించడంతో పాటు ఆకట్టుకుంటూ ఉంటాయి.
అచ్చం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ గా చక్కర్లు కొడుతుంది.
"""/" / పెళ్లి వేడుకల( Wedding Ceremonies ) కోసం డెకరేట్ చేసిన వరుడు కార్ సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో నెటిజన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటుంది.
సాధారణంగా ఎవరైనా సరే వరుడు కారును పువ్వులతో అందంగా డెకరేట్ చేసుకుంటూ ఉంటారు.
కానీ, ఓ వరుడి కారు మాత్రం కూరగాయలతో డిజైన్ చేశారు.కేవలం కూరగాయలతో కాకుండా పండ్లతో కూడా డిజైన్ చేయడం చూసి అందరూ ఆశ్చర్యానికి లోనవుతున్నారు.
పచ్చిమిర్చి, అరటి పండ్లు, బెండకాయ, వంకాయలు ఇలా తదితర పదార్థాలతో ఆ కారును డెకరేట్ చేయడం అందరికీ చాలా వింతగా అనిపించింది.
"""/" / ఈ వీడియోను చూసిన కొంతమంది నెటిజన్స్ ఇది పెళ్లి వేడుకలలో ఊరేగింపులా లేదు.
కూరగాయల వ్యాపారి పెళ్లి ఊరేగింపులా ఉంది అని కామెంట్ చేస్తున్నారు.మరికొందరు ఆ కారు డెకరేట్ చేసిన వారి టాలెంట్ ను కొనియాడుతున్నారు.
ఇక మరికొందరు అయితే ఇలా డిఫరెంట్ గా కారును డెకరేట్ చేయడానికి గల కారణం ఏమిటా అని కామెంట్ చేశారు.
మొత్తానికి కొత్తగా అలోచించి కార్ డెకరేట్ చేయడంతో ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది.
2025 లో కూడా మనవాళ్ళు బాలీవుడ్ కు చెమటలు పట్టించడం పక్కానా..?