పుచ్చకాయ గింజలు తినకుండా పడేస్తున్నారా.. అయితే ఇది మీకోసమే..

ముఖ్యంగా ఎండాకాలంలో పుచ్చకాయ ప్రజల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ముఖ్యంగా చెప్పాలంటే పుచ్చకాయ ప్రజల దప్పికను తీర్చడంతో పాటు ఆరోగ్యానికి కూడా ఎన్నో ప్రయోజనాలు కలిగిస్తుంది.

పుచ్చకాయ తినేటప్పుడు అందులో ఉన్న గింజలను బయటపడేస్తూ ఉంటారు.కానీ ఆ పుచ్చకాయ గింజలలోనే అనేక ప్రయోజనాలు ఉన్నాయి.

ఈ విషయం దాదాపు చాలామందికి తెలియదు.ఈ విత్తనాలలో ఐరన్, కాపర్, మాంగనీస్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్, సోడియం, విటమిన్స్, ప్రోటీన్స్, అంతే కాకుండా యాంటీ ఆక్సిడెంట్ కూడా ఉన్నాయి.

పుచ్చకాయ గింజలు జుట్టు బాగా పెరిగేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి. """/"/ ఇందులో కాపర్ జుట్టు పెరిగేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది.

ఎందుకంటే ఇందులో మెలనిన్ ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది.పుచ్చకాయ గింజలను మెత్తగా నూరి పేస్టులా చేసి ముఖానికి అప్లై చేయడం ద్వారా చర్మం కాంతివంతంగా తయారవుతుంది.

ఇంకా చెప్పాలంటే చర్మం పై ఉన్న ముడతలు మరియు చర్మం పొడి బరాడం లాంటి సమస్యలను కూడా ఇవి తగ్గిస్తాయి.

మధుమేహం ఉన్నవారికి పుచ్చకాయ గింజలు ఒక మంచి ఔషధం అని చెప్పవచ్చు.పుచ్చకాయ గింజలు తినడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.

ఇందులోని ఐరన్, రక్తహీనత సమస్యలు కూడా తగ్గిస్తుంది. """/"/ ఆ గింజల్లో ఉండే పాలి మెనో అన్ శ్యాచ్చురేటడ్ ఫ్యాటీ ఆమ్లాలు కొలెస్ట్రాలను తగ్గించడంతోపాటు గుండెకు సంబంధించిన సమస్యలను కూడా తగ్గిస్తాయి.

పుచ్చకాయ గింజలు ఎముకల ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి.జీర్ణ వ్యవస్థ పనితీరిని మెరుగుపరుస్తుంది.

పుచ్చకాయ గింజలు యాంటీ ఆక్సిడెంట్లను ఎక్కువగా కలిగి ఉంటాయి.ఇది శరీరాన్ని ఫ్రీరాడికల్స్ భారీ నుంచి కాపాడుతాయి.

ఇందులో ఉండే పోషకాలు ఖనిజాలన్నీ మరియు డిఎన్ఏ ల డేమేజ్ ల నుంచి కాపాడుతాయి.

కాబట్టి పుచ్చకాయ తినేటప్పుడు గింజలతో పాటు తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.

నాగార్జునతో అలాంటి సినిమా తీస్తానని చెబుతున్న అనిల్ రావిపూడి.. ఈ కాంబో సాధ్యమేనా?