ఎప్పుడూ ప్రతికూల ఆలోచనలే వస్తున్నాయా.. అయితే ఇలా చేసి చూడండి..!

ఈ ప్రపంచంలో గాలి కంటే వేగమైనది మనసు అని ఖచ్చితంగా చెప్పవచ్చు.ఆ మనసు కంటే వేగమైనది ఆలోచన( Idea ).

ఈ ఆలోచనలే వ్యక్తిగతిని మారుస్తాయి.ఈ వ్యక్తి ఉన్నత శిఖరాలకు చేరాలన్న, అథపాతాళానికి చేరాలన్న ఈ ఆలోచనలే కారణమవుతాయి.

అయితే ఏదైనా ఆలోచించే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి.ఆలోచన ఏదైనా అది మీకు సాధ్యమేనా ఆ ఆలోచన మంచిదేనా అని కూడా ఆలోచించడం ఎంతో మంచిది.

కొందరు ఏదైనా పని చేయాలన్న, ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్న ఒకటికి పది సార్లు ఆలోచిస్తూ ఉంటారు.

"""/" / ఏది సరైనది ఏది తప్పు అని అంచనా వేస్తూ ఉంటారు.

తీరా ఒక నిర్ణయానికి వచ్చాక ఆ నిర్ణయం అమలు చేయడానికి వెనకడుగు వేస్తుంటారు.

కారణం భయం, నెగిటివ్ థింకింగ్, ఆత్మవిశ్వాసం( Self Confidence ) లేకపోవడం అందుకే ఈ నెగిటివ్ థాట్స్( Negative Thinking ) కు దూరంగా ఉండాలని మానసిక నిపుణులు సూచిస్తారు.

నెగిటివ్ థింకింగ్ ను వదిలేసి అన్ని సాధ్యమే అనే పాజిటివ్ దృక్పథాన్ని పెంచుకోవాలి.

ఎవరైనా మీకు వ్యతిరేకంగా మాట్లాడితే వెంటనే అగ్రహానికి గురికాకుండా వారిని పట్టించుకోవడం మానేయాలి.

మీ ముఖంపై చిరునవ్వును చెరగనివ్వకూడదు.అదే వారికి మీరు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ అవుతుంది.

"""/" / ఎవరైనా మీకు వ్యతిరేకంగా మాట్లాడితే ముఖాన్ని కిందకు దించండి.అయితే విచారంగా నిలబడకూడదు.

పదేపదే ఆలోచిస్తూ చిందించకూడదు.వారు అన్న అంశాలను పట్టించుకోకుండా చిరునవ్వు( Smile )తో ఉండాలి.

చివరకు మీకు వ్యతిరేకంగా మాట్లాడే వారే తలదించుకుంటారు.నెగిటివ్ థింకింగ్ ను వదులుకునే విషయంలో మరో కీలక అంశం నో చెప్పడం నేర్చుకోవాలి.

అందరి మాటలు వినాల్సిన అవసరం అస్సలు లేదు.ఇలా అందరి మాటలు విని మిమ్మల్ని మీరు ఇబ్బందుల్లోకి నెట్టుకోకూడదు.

ఏదైనా కరెక్టు కాదనిపిస్తే మీ వల్ల కాదనిపిస్తే వెంటనే సుటీ గా సుత్తి లేకుండా నో అని చెప్పాలి.

పనికిరాని అంశాలపై చర్చలు పెట్టుకోకూడదు.ప్రతి ప్రతికూల అంశాలపై చర్చించడం మానుకోవాలి.

ఇవి మీ మనసుపై చెడు ప్రభావాన్ని చూపుతాయి.మీరు చేసే పనిని ప్రేమించడం ఎంతో మంచిది.

మీకు బాధ కలిగించే ఆలోచనలు, పనులను అస్సలు చేయకూడదు.

మెంతులు, అరటి పండుతో ఇలా చేశారంటే మీ జుట్టు దట్టంగా పెరగడం గ్యారెంటీ..!