మంగళసూత్రానికి హారతిని అద్దుతున్నారా... అయితే ఇది తెలుసుకోవాల్సిందే!

మన హిందూ సాంప్రదాయాలు ప్రకారం చాలా మంది మహిళలు ఆచార సంప్రదాయాలను ఎంతో పాటిస్తారు.

ముఖ్యంగా వివాహమైన స్త్రీలు ఈ విధమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలను ఎంతగానో విశ్వసిస్తారు.పెళ్లైన మహిళలు నిండు ముత్తైదువుగా నిత్యం పసుపు కుంకుమలతో చేతుల నిండా గాజులతో ఎంతో అందంగా సుమంగళిగా ముస్తాబవుతుంది.

ఈ క్రమంలోనే ప్రతి రోజు పూజ అనంతరం మహిళ తన మంగళసూత్రానికి పసుపు కుంకుమను పెట్టి హారతి ఇవ్వడం మనం చూస్తుంటాము.

అయితే మంగళసూత్రానికి హారతిని ఇవ్వకూడదని పండితులు చెబుతున్నారు.మంగళ సూత్రానికి పసుపు కుంకుమలు పెట్టడం ఎంతో శుభకరం.

ఇలా పసుపు కుంకుమలు పెట్టడం వల్ల తన భర్త ఆయుష్షు పెరుగుతుందని తన దీర్ఘ సుమంగళిగా ఉంటుందని భావిస్తారు.

ఇలా మాంగల్యానికి పసుపు కుంకుమ పెట్టి పూజ చేయడం ఎంతో మంచిదని, అయితే హారతి ఇవ్వకూడదని పండితులు చెబుతున్నారు.

ఇలా మహిళలు మంగళసూత్రానికి హారతి ఇవ్వడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

"""/" / మంగళసూత్రానికి హారతి ఇవ్వడం వల్ల భర్త ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు.

అదే విధంగా ప్రమాదాలు, శత్రుబాధలు, భర్త ఆయుష్షు క్షీణం అవుతుందనీ పండితులు చెబుతున్నారు.

కనుక ప్రతి నిత్యం పూజా కార్యక్రమాల అనంతరం కేవలం మాంగల్యానికి పసుపు కుంకుమ మాత్రమే పెట్టాలి కానీ హారతి ఇవ్వకూడదు.

అలాగే ఒక అమ్మాయి ఎల్లప్పుడు నుదుటిన బొట్టు చేతికి గాజులు తప్పనిసరిగా వేసుకోవాలని, అలా వేసుకోవడం వల్ల వివాహం తరువాత, మంచి గౌరవప్రదమైన అత్తగారి కుటుంబం పొందుతారు.

చంద్రబాబు నమ్మదగిన వ్యక్తి కాదు..: జూ.ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు