ప్రయాణిస్తున్న రైలు నుండి ఫోన్ జారిపోతే కంగారుపడకుండా ఇలా చేయండి!

భారతీయ రైల్వే ప్రపంచంలో( World Of Indian Railways ) నాల్గవ అతిపెద్ద రైల్వే వ్యవస్థగా పేరుగాంచిందనే విషయం అందరికీ తెలిసే ఉంటుంది.

దేశ వ్యాప్తంగా చూసుకుంటే ప్రతిరోజూ ఇక్కడ 2.5 కోట్ల మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుతూ ఉంటారు.

బస్సులు, కార్లు, విమానాలతో పోలిస్తే టికెట్ ధరలు తక్కువగా ఉండడం వలన అందరూ ట్రైన్ జర్నీకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు.

అయితే రైల్లో ప్రయాణించేటప్పుడు.ముఖ్యంగా జనరల్ బోగీలలో( General Bogies ) చాలా మంది డోర్ దగ్గర నిలబడి ప్రయాణిస్తూ ఉంటారు.

ఇక కోచ్ ఏదైనప్పటికీ కొంతమంది విండోకి దగ్గర కూర్చొని బయట పరిసరాలు ఎంజాయ్ చేస్తూ, మధ్యమధ్యలో ఫోన్ చూస్తూ ఉంటారు.

అదే పనిగా ఏదైనా మంచి లొకేషన్ మంచిగా కనిపించినప్పుడు సెల్ ఫోన్లో ఫోటోలు, వీడియోలు తీస్తుంటారు.

అలాంటి సమయాలలో కొంతమంది ఫోన్స్ పొరపాటున జారవిడుస్తారు.దాంతో చాలామంది కంగారు పడిపోతూ ఉంటారు.

"""/" / ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఎక్కువ కంగారు పడకుండా రైల్వే శాఖను సంప్రదిస్తే పడిపోయిన వస్తువు దొరికే ఛాన్స్ ఉంటుంది.

ఇలా ఒక్క ఫోన్ మాత్రమే కాదు మీ వస్తువులు ఏవి పడిపోయినా వాటిని తిరిగి పొందడానికి రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

అయితే దానికోసం మీ సెల్ ఫోన్ లేదా వస్తువు పడిపోయిన చోట ఉండే రైల్వే పోల్స్ ( Railway Poles )పై ఉండే పసుపు, ఆకుపచ్చ రంగుల్లో ఉన్న నెంబర్లను గుర్తుపెట్టుకోవాలి.

వెంటనే ట్రైన్ లో ఉన్న టికెట్ కలెక్టర్ లేదా రైల్వే పోలీసులకు సదరు సమాచారం అందిస్తే, వారు తమ సిబ్బందికి సమాచారం ఇచ్చి రికవరీ చేయిస్తారు.

ఒకవేళ టీసీ మీకు అందుబాటులో లేకపోతే 182 లేదా 139 నంబరుకి కాల్ చేసి మీ ఫోన్ పడిపోయిన చోటు, రైల్వే పోల్స్ నంబర్లు, దగ్గర్లో ఉన్న స్టేషన్, టైమ్ వంటి వివరాలు చెబితే ఫలితం ఉంటుంది.

"""/" / మీరు విషయం వారికి చేరవేసిన వెంటనే వారు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు( Railway Protection Force ) ను పంపించి మీ సెల్ ఫోన్ లేదా వస్తువును రికవరీ చేయిస్తారు.

అయితే ఈ విషయంలో మీరు ఆలస్యం చేస్తే ఆ వస్తువు వేరే ఎవరైనా తీసేసుకొనే ఛాన్స్ ఉంటుంది కాబట్టి, ఏదైనా వస్తువు పోయిన వెంటనే సర్దుకుంటే బావుంటుంది.

ఇది కూడా కుదరకపోతే తరువాత స్టేషన్ లో దిగి స్టేషన్ మాస్టర్ ని కలిసి వివరాలు చెప్పినా ఫలితం ఉంటుంది.

రికవరీ జోన్ ఆఫీసర్ ద్వారా వాళ్లు అవసరమైన చర్యలు తీసుకుంటారు.

హత్య సినిమా రివ్యూ అండ్ రేటింగ్!