దానిమ్మ తొక్కలతో ఇలా చేశారంటే మచ్చలేని చర్మం మీ సొంతం!

కొందరికి ముఖంపై నల్లటి మచ్చలు ఏర్పడుతుంటాయి.ఇవి ఓ పట్టాన అస్సలు పోవు.

ఆ నల్ల మచ్చల‌ను ( Black Spots )వదిలించుకుని స్పాట్ లెస్‌ స్కిన్ ను పొందడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.

ఎన్నెన్నో ప్రోడక్ట్స్ వాడి విసిగిపోతుంటారు.అయితే అలాంటివారికి దానిమ్మ తొక్కలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.

నిజానికి దానిమ్మ తొక్కలు ఎందుకు పనికిరావని చాలామంది భావించి వాటిని డస్ట్ బిన్ లోకి తోసేస్తుంటారు.

కానీ దానిమ్మ గింజల్లోనే( Pomegranate Seeds ) కాదు తొక్కల్లో కూడా ఎన్నో పోషకాలు నిండి ఉంటాయి.

ఆరోగ్యపరంగానే కాకుండా కురుల సంరక్షణకు, చర్మ సౌందర్యాన్ని పెంపొందించడానికి కూడా దానిమ్మ తొక్కలు అద్భుతంగా తోడ్పడతాయి.

ఈ నేపథ్యంలోనే మచ్చలేని చర్మాన్ని పొందడానికి దానిమ్మ తొక్కలను ఏ విధంగా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా దానిమ్మ తొక్కలను బాగా ఎండబెట్టి మెత్తగా పొడి చేసుకుని స్టోర్ చేసుకోవాలి.

ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ దానిమ్మ తొక్కల పొడి వేసుకోవాలి.

అలాగే వన్ టీ స్పూన్ గులాబీ రేకుల పొడి( Rose Petal Powder ), వన్ టీ స్పూన్ తేనె మరియు సరిపడా పాలు లేదా రోజ్ వాటర్ ( Rose Water )వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇలా తయారు చేసుకున్న‌ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని 15 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

ఆ తర్వాత వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి. """/" / రెండు రోజులకు ఒకసారి ఈ రెమెడీని కనుక పాటించారంటే ఆశ్చర్యపోయే లాభాలు మీ సొంతమవుతాయి.

దానిమ్మ తొక్కలో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి.

అందువల్ల దానిమ్మ తొక్కలు మొటిమలకు అడ్డుకట్ట వేయడానికి మచ్చల నివారణకు ఎఫెక్టివ్ గా సహాయ పడతాయి.

"""/" / ఇప్పుడు చెప్పుకున్న రెమెడీని తరచూ ప్రయత్నించడం వల్ల మీ ముఖంపై నల్లటి మచ్చలు క్రమంగా మాయమవుతాయి.

మచ్చలేని చర్మం మీ సొంతం అవుతుంది.అలాగే ఈ రెమెడీ చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది.

మురికి, చనిపోయిన చర్మ కణాలను తొలగించి చర్మాన్ని కాంతివంతంగా అందంగా మెరిపిస్తుంది.బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ను కూడా తొలగిస్తుంది.

ఆ విషయంలో అమ్మాయిలకు హ్యాట్సాఫ్… విశ్వక్ సేన్ కామెంట్స్ వైరల్!