అరటి పండుతో ఇలా చేశారంటే యవ్వనమైన మెరిసే చర్మం మీ సొంతం!

అరటిపండు( Banana ) ఆరోగ్యాన్ని పెంచడానికి మాత్రమే కాదు సౌందర్య సాధనంగా కూడా ఉపయోగపడుతుంది.

అరటి పండులో ఉండే పోషకాలు చర్మ ఆరోగ్యాన్ని పోషిస్తాయి.అరటిపండు చర్మానికి మాయిశ్చరైజింగ్( Moisturizing ) లక్షణాలను అందిస్తుంది.

వృద్ధాప్య సంకేతాలను తగ్గించి చర్మం యవ్వనంగా( Youthful Skin ) మెరిసేలా ప్రోత్సహిస్తుంది.

ఇటీవల రోజుల్లో చాలా మంది చిన్న వయసులోనే పెద్ద వారిలా కనిపిస్తున్నారు.ఇందుకు కారణం స్కిన్ ఏజింగ్.

అయితే స్కిన్ ఏజింగ్ ను ఆలస్యం చేయడంలో అరటిపండు తోడ్పడుతుంది.అందుకు అరటి పండును ఏ విధంగా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

"""/" / ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఐదు బాదం గింజలు( Almonds ) వేసి వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.

మరుసటి రోజు మిక్సీ జార్ తీసుకుని అందులో ఐదు నుంచి ఆరు పీల్ తొలగించిన అరటిపండు స్లైసెస్ వేసుకోవాలి.

అలాగే నైట్ అంతా నానబెట్టి పొట్టు తొలగించిన బాదం గింజలు, నాలుగు టేబుల్ స్పూన్లు పచ్చిపాలు( Milk ) వేసుకుని చాలా స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో రెండు చుక్కలు విటమిన్ ఈ ఆయిల్ వేసి మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు మరియు చేతులకు అప్లై చేసుకుని 15 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

"""/" / ఆపై తడివేళ్ల‌తో చర్మాన్ని సున్నితంగా ఐదు నిమిషాల పాటు మసాజ్ చేసుకుని గోరువెచ్చని నీటితో క్లీన్ చేసుకోవాలి.

వారానికి ఒకసారి ఏ విధంగా చేయడం వల్ల అద్భుత ఫలితాలు పొందుతారు.అరటిపండు, బాదం, పాలు మరియు విటమిన్ ఇ ఆయిల్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు సూర్యరశ్మి మరియు వృద్ధాప్య సంకేతాల నుండి చర్మాన్ని రక్షించడంలో సహాయపడతాయి.

కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి.చర్మం యొక్క వృద్ధాప్య ప్రక్రియను స్లో గా మారుస్తాయి.

చర్మం యవ్వనంగా కాంతివంతంగా మెరిసేలా ప్రోత్సహిస్తాయి.ఆల్రెడీ ముడతల స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న‌వారు కూడా ఈ రెమెడీని ప్రయత్నించవచ్చు.

ఈ రెమెడీ ముడతలను క్రమంగా మాయం చేస్తుంది.సాగిన చర్మాన్ని బిగుతుగా మారుస్తుంది.

సన్నని గీతలను తొలగిస్తుంది.ఇక అరటి పండు లోని పొటాషియం చర్మానికి రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది.

స్కిన్ ను వైట్ గా, బ్రైట్ గా మారుస్తుంది.

మరోమారు కొంప ముంచిన గూగుల్‌ మ్యాప్స్‌.. లోయలోకి దూసుకెళ్లిన భారీ కంటైనర్..