ఓపెన్ పోర్స్ తొల‌గిపోయి గ్లోయింగ్ స్కిన్ ను పొందాలంటే ఇలా చేయండి!

ఓపెన్ పోర్స్.దీని గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు.

కాంబినేషన్ స్కిన్ నుండి ఆయిల్ స్కిన్ ఉన్న వారి వరకు అంద‌రినీ ఈ స‌మ‌స్య వేధిస్తూనే ఉంటుంది.

ఈ ఓపెన్ పోర్స్ కార‌ణంగా మొటిమ‌లు, మ‌చ్చ‌లు, ముడ‌త‌లు, బ్లాక్ హెడ్స్‌ వంటి స‌మ‌స్య‌లు సైతం తీవ్రంగా స‌త‌మ‌తం చేస్తుంటాయి.

అందుకే ముఖంపై వచ్చే ఓపెన్ పోర్స్ ను తగ్గించుకునేందుకు వివిధ రకాల క్రీములు రాస్తుంటారు.

అయితే మార్కెట్‌లో ల‌భ్య‌మ‌య్యే క్రీముల వ‌ల్ల ఎలాంటి ఫ‌లితం ఉంటుందో తెలియ‌దు గానీ.

ఇప్పుడు చెప్ప‌బోయే విధంగా చేస్తే మాత్రం ఓపెన్ పోర్స్ తొల‌గిపోయి గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం అవుతుంది.

స్టెప్-1: ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ల ఫ్రెష్ గులాబీ రేక‌ల జ్యూస్‌, వ‌న్ టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్, హాఫ్ టేబుల్ స్పూన్ వైట్ కుక్కింగ్ వెనిగ‌ల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని దూది సాయంతో ముఖానికి అప్లై చేసుకుని.పూర్తిగా డ్రై అవ్వ‌నిచ్చి అప్పుడు గోరు వెచ్చ‌ని నీటితో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

"""/"/ స్టెప్‌-2: ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల ముల్తానీ మ‌ట్టి, వ‌న్ టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్, వ‌న్ టేబుల్ స్పూన్ తేనె, మూడు టేబుల్ స్పూన్ల ట‌మాటో జ్యూస్ వేసుకుని అన్నీ క‌లిసేంత వ‌ర‌కు మిక్స్ చేయాలి.

ఇప్పుడు ఏదైనా బ్ర‌ష్ సాయంతో ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి కాస్త మందంగా అప్లై చేసుకోవాలి.

ఇర‌వై నిమిషాల అనంత‌రం నార్మ‌ల్ వాట‌ర్‌తో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.మూడు రోజుల‌కు ఒక‌సారి ఈ రెండు స్టెప్స్‌ను ఫాలో అయితే ఓపెన్ పోర్స్ తొల‌గిపోతాయి.

అదేస‌మ‌యంలో ముఖం అందంగా, గ్లోయింగ్‌గా మారుతుంది.

ఈ నలుగురు హీరోయిన్స్ భవిష్యత్తు ప్రభాస్ పైనే ఆధారపడి ఉంది!