పెదాల న‌లుపుని వ‌దిలించి గులాబీ రంగులోకి మార్చే బెస్ట్ రెమెడీ మీకోసం!

పెదాలు గులాబీ రంగులో( Pink Lips ) మెరుస్తూ కనిపిస్తే ముఖం మరింత అందంగా, అట్రాక్టివ్ గా మారుతుంది.

అందుకే అటువంటి పెదాల కోసం మ‌గువ‌లు తెగ ఆరాటపడుతుంటారు.కానీ పెదాల సంరక్షణ లేకపోవడం, డెడ్ స్కిన్ సెల్స్ పేరుకుపోవడం, ఎండల ప్రభావం, ఆహారపు అలవాట్లు, శరీరంలో అధిక వేడి, ధూమపానం తదితర కారణాల వల్ల పెదాలు నల్లగా, కాంతిహీనంగా మారుతుంటాయి.

అటువంటి పెదాల వల్ల చాలా అసౌకర్యానికి గురవుతుంటారు.డార్క్ లిప్స్( Dark Lips ) ను కవర్ చేసుకునేందుకు లిప్ స్టిక్స్ పై ఆధారపడుతుంటారు.

కానీ సహజంగా కూడా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.పది రోజుల్లోనే పెదాల నలుపును మాయం చేసే మ్యాజికల్ రెమెడీ ఒకటి ఉంది.

ఆ రెమెడీ ఏంటి అనేది ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు బ్రౌన్ షుగర్( Brown Sugar ), వన్ టేబుల్ స్పూన్ రోజ్‌ పెటల్స్ పౌడర్( Rose Petals Powder ) వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

"""/" / ఆ తర్వాత వ‌న్‌ టేబుల్ స్పూన్ వాసెలిన్, మూడు టేబుల్ స్పూన్లు స్వీట్ ఆల్మండ్ ఆయిల్( Sweet Almond Oil ) వేసుకుని అన్నీ కలిసేంతవరకు బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక బాక్స్ లో నింపుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.

ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని పెదాలకు అప్లై చేసి వేళ్ళతో సున్నితంగా ఒకటి లేదా రెండు నిమిషాల పాటు రబ్ చేసుకోవాలి.

ఆపై ఐదు నిమిషాల పాటు పెదాల‌ను ఆరబెట్టుకుని అప్పుడు వాటర్ తో శుభ్రంగా లిప్స్ ను క్లీన్ చేసుకోవాలి.

ఫైనల్ గా పెదాలకు మంచి సీరం లేదా మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోవాలి.

"""/" / రోజుకు ఒకసారి ఈ విధంగా చేస్తే బ్రౌన్ షుగర్, రోజ్ పెటల్స్, ఆల్మండ్ ఆయిల్ మరియు వాసెలిన్ లో ఉండే ప్రత్యేక గుణాలు పెదాల నలుపును క్రమంగా మాయం చేస్తాయి.

కొద్ది రోజుల్లోనే పెదాలు గులాబీ రంగులోకి మార‌తాయి.అంతేకాదు ఈ రెమెడీని పాటించడం వల్ల డ్రై లిప్స్ కు బై బై చెప్పవచ్చు.

తరచూ ఏ రెమెడీని పాటిస్తే మీ పెదాలు మృదువుగా కోమలంగా మెరుస్తాయి.మీ ముఖంలో స్పెషల్ అట్రాక్షన్ అవుతాయి.

కాబట్టి నల్లటి పెదాలతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ మ్యాజికల్ రెమెడీని పాటించండి.

ఏ భార్యను ఏ భర్త కూడా ఇంతలా టార్చర్ పెట్టి ఉండడు.. కానీ కమల్ హాసన్ చేసాడు..!