మీ పిల్లలు రక్తహీనత బారిన పడ్డారా? అయితే వెంటనే ఇలా చేయండి!

రక్తహీనత.అత్యంత సర్వ సాధారణంగా వేధించే ప్రమాదకర సమస్యల్లో ఒకటి.

ముఖ్యంగా మహిళలు, పిల్లల్లో రక్తహీనత అనేది చాలా అధికంగా కనిపిస్తుంటుంది.రక్తహీనతను ఎంత నిర్లక్ష్యం చేస్తే అంత ముప్పు పెరుగుతుంది.

అందుకే వీలైనంత త్వరగా దాని నుంచి బయటపడేందుకు ప్రయత్నించాలి.పిల్లల్లో రక్తహీనత( Anemia ) కు ప్రధాన కారణం పోషకాహార లోపం.

మీ పిల్లలు కూడా రక్తహీనత బారిన పడ్డారా? అయితే వెంటనే ఇప్పుడు చెప్పబోయే లడ్డూను వారి డైట్ లో చేర్చండి.

ఈ లడ్డూను రోజుకొకటి తీసుకుంటే ఎలాంటి రక్తహీనత అయిన దెబ్బకు పరార్ అవుతుంది.

అలాగే మీ పిల్లలకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు సైతం లభిస్తాయి.మరి ఇంతకీ ఆ లడ్డూలను ఎలా తయారు చేసుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో రెండు కప్పులు నువ్వులు వేసుకుని బాగా వేయించుకుని తీసుకోవాలి.

ఆ తర్వాత అదే పాన్ లో ఒక కప్పు వేరుశనగలు మరియు ఒక కప్పు ఎండు కొబ్బరి పొడి( Dry Coconut Powder ) వేసి విడివిడిగా వేయించి పెట్టుకోవాలి.

"""/" / ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించి పెట్టుకున్న నువ్వులు, వేరుశనగలు( Sesame Seeds , Peanuts ) వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఆ తర్వాత కొబ్బరి పొడి, ఒకటిన్నర కప్పు బెల్లం తురుము, మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసి మరోసారి గ్రైండ్ చేసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న లడ్డూల మాదిరి చుట్టుకుని ఒక బాక్స్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.

ఈ లడ్డూలు చాలా రుచిగా ఉండడమే కాదు బోలెడన్ని పోషకాలు కలిగి ఉంటాయి.

"""/" / ఈ లడ్డూలను పిల్లల చేత రోజుకొకటి చొప్పున తినిపిస్తే ఐరన్, క్యాల్షియం, ప్రోటీన్( Iron, Calcium, Protein ) తో సహా ఎన్నో విలువైన పోషకాలు వారి శరీరానికి లభిస్తాయి.

రక్తహీనత కొద్దిరోజుల్లోనే తగ్గు ముఖం పడుతుంది.రక్తహీనతను నివారించడానికి ఈ లడ్డు చాలా ఉత్తమంగా సహాయపడతాయి.

అలాగే ఈ లడ్డూలను తీసుకుంటే పిల్లల్లో బ్రెయిన్ డెవలప్మెంట్ అద్భుతంగా సాగుతుంది.ఎముకలు దృఢంగా పెరుగుతాయి.

పిల్లలు రోజంతా ఫుల్ ఎనర్జిటిక్ గా, యాక్టివ్ గా ఉంటారు.ప్రతి పనుల్లో చురుగ్గా సైతం పాల్గొంటారు.

లండన్ చేరుకున్న ఏపీ సీఎం జగన్..!!