పది నిమిషాల్లో తలనొప్పి నుంచి రిలీఫ్ పొందాలంటే ఇలా చేయండి!

పది నిమిషాల్లో తలనొప్పి నుంచి రిలీఫ్ పొందాలంటే ఇలా చేయండి!

ప్రస్తుత రోజుల్లో దాదాపు ప్రతి ఒక్కరిది బిజీ లైఫ్ స్టైల్ అయిపోయింది.సంపాదనలో పడి కాళ్లకు చక్రాలు కట్టుకుని మరీ తిరిగేస్తున్నారు.

పది నిమిషాల్లో తలనొప్పి నుంచి రిలీఫ్ పొందాలంటే ఇలా చేయండి!

ఉరుకుల పరుగుల జీవితంలో రోజుకు ఒక్కసారైనా మనల్ని తలనొప్పి పలకరిస్తుంటుంది.తలనొప్పి( Headache ) రాగానే పెయిన్ కిల్లర్ వేసుకోవడం చాలా మందికి ఉండే అల‌వాటు.

పది నిమిషాల్లో తలనొప్పి నుంచి రిలీఫ్ పొందాలంటే ఇలా చేయండి!

కానీ పెయిన్ కిల్ల‌ర్స్ అవ‌స‌రం లేకుండా సహజంగా కూడా తలనొప్పి నుంచి రిలీఫ్ పొందవచ్చు.

ముఖ్యంగా పది నిమిషాల్లో తలనొప్పిని తరిమికొట్టే ఎఫెక్టివ్ టీ ఒకటి ఉంది.ఆ టీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ ( Glass Of Water )పోసుకోవాలి.

వాటర్ హీట్ అయ్యాక అందులో పది ఫ్రెష్ పుదీనా ఆకులు( Fresh Mint Leaves ), వన్ టేబుల్ స్పూన్ సోంపు గింజలు( Anise Seeds ), రెండు దంచిన యాలకులు( Cardamom ), నాలుగు లవంగాలు వేసి బాగా మరిగించాలి.

ప‌ది నుంచి ప‌న్నెండు నిమిషాల పాటు బాయిల్ చేస్తే మన టీ అనేది రెడీ అవుతుంది.

ఈ పుదీనా సోంపు టీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ప్రధానంగా తలనొప్పికి విరుగుడుగా పని చేస్తుంది.

"""/" / తలనొప్పి బాధిస్తున్నప్పుడు ఈ టీ తయారు చేసుకుని తీసుకుంటే పది నిమిషాల్లో ఉపశమనం పొందుతారు.

ఈ పుదీనా సోంపు టీలో యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉన్నాయి.ఇవి శ్వాసను పునరుద్ధరిస్తాయి మరియు నోటి బ్యాక్టీరియాను నివారించి బ్యాడ్‌ బ్రీత్ సమస్యకు చెక్ పెడతాయి.

అలాగే ఈ టీ కఫం మరియు శ్లేష్మం విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది.జ‌లుబు, ద‌గ్గు వంటి స‌మ‌స్య‌ల నుంచి రిలీఫ్ అందిస్తుంది.

"""/" / వికారం, వాంతులు, క‌డుపు నొప్పి మరియు ఇతర కడుపు సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి పుదీనా సోంపు టీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

ఈ టీ తాగితే ఆయా సమస్యల నుంచి బయటపడొచ్చు.అంతేకాకుండా ఈ పుదీనా సోంపు టీ రోగ‌ నిరోధక వ్యవస్థను సైతం బలోపేతం చేస్తుంది.

హీరోలు ప్రేక్షకులకు బోర్ కొట్టేస్తారు.. కిచ్చా సుదీప్ సంచలన వ్యాఖ్యలు వైరల్!