పీరియడ్స్ ఆన్ టైమ్ కి రావాలంటే ఇలా చేయండి..!

సాధారణంగా కొందరికి పీరియడ్స్ ( Periods )ఆలస్యంగా వస్తుంటాయి.ఇందుకు కార‌ణాలే ఏమైన‌ప్ప‌టికీ.

ఏదైనా పండగలు ముఖ్యమైన శుభకార్యాలు ఉన్నప్పుడు పీరియడ్స్ ఆలస్యం అయితే చాలా టెన్షన్ పడుతుంటారు.

పీరియడ్స్ ఆన్ టైమ్ కి రావడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.అయితే అలాంటి సమయంలో ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ ను కనుక తీసుకుంటే టైమ్ కి పీరియడ్స్ రావడం గ్యారెంటీ.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ డ్రింక్ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.

? అన్న విషయాలు తెలుసుకుందాం పదండి.ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలి.

వాటర్ హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర( Cumin ) వేసుకోవాలి.

అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు ( Turmaric )వేసి పది నుంచి ప‌న్నెండు నిమిషాల పాటు మరిగించాలి.

అనంతరం స్టవ్ ఆఫ్ చేసుకుని మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకుని గోరు వెచ్చగా అయ్యాక సేవించాలి.

నెలసరి సమయానికి వారం రోజుల ముందు నుంచి ఈ డ్రింక్‌ ను తీసుకోవాలి.

"""/" / రోజుకు ఒకసారి ఈ డ్రింక్ ను కనుక తీసుకుంటే పీరియడ్స్ ఆన్ టైం కు వస్తాయి.

ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ( Irregular Periods )సమస్యతో బాధపడుతున్న వారికి ఈ డ్రింక్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

నెలసరి నొప్పి( Menstrual Pain ) నుంచి ఉపశమనాన్ని అందించ‌డానికి కూడా ఈ డ్రింక్ స‌హాయ‌ప‌డుతుంది.

పైగా ఈ డ్రింక్ త‌యారీలో ఉప‌యోగించిన జీల‌క‌ర్ర‌, ప‌సుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు మెండుగా ఉంటాయి.

ఇవి ఆర్థరైటిక్ లక్షణాల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. """/" / ఈ డ్రింక్ రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ను కరిగించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

అంతేకాకుండా ఈ డ్రింక్ శరీరంలో విషాల‌ను బయటకు పంపడంలో సహాయపడుతుంది.రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.

మరియు జ‌లుగు, ద‌గ్గు వంటి సీజ‌న‌ల్ స‌మ‌స్య‌ల నుంచి వేగంగా ఉపశమనాన్ని అందించడంలో కూడా అద్భుతంగా హెల్ప్ చేస్తుంది.