ఈ ఒక్క సెట్టింగుతో స్పామ్ కాల్స్ నుండి ఉపశమనం పొందండి!
TeluguStop.com
దేశ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు స్మార్ట్ ఫోన్ వాడడంతో ప్రతిరోజు స్పామ్ కాల్స్‌తో( Spam Calls ) అనేకమంది ఇబ్బంది పడుతున్నారు.
ముఖ్యమైన పనుల్లో బిజీగా ఉన్న సమయంలో అకస్మాత్తుగా స్పామ్ కాల్స్ వంటివి వస్తే ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయో చెప్పడం చాలా కష్టం.
ఈ క్రమంలో కొన్ని సార్లు భారీగా నష్టపోతున్నారు.అయితే స్మార్ట్ ఫోన్‌లోని( Smart Phone ) కొన్ని సెట్టింగ్‌లను మార్చుకోవడం వలన ఈ స్పామ్ కాల్స్ సమస్య నుంచి తప్పించుకోవచ్చు అని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.
"""/" /
ఈ కాల్స్ ప్రధానంగా లోన్ ఆఫర్స్, ఈఎంఐ, క్రెడిట్ కార్డ్, కార్, హామ్ లోన్ సహా అనేక అంశాలకు సంబంధించినవిగా ఉంటున్నాయి.
ఈ స్పామ్ కాల్‌లను నివారించడానికి వినియోగదారులు DND మోడ్‌ని ఉపయోగించవచ్చని అంటున్నారు.అయితే DND మోడ్‌ని ఇక్కడ ఎక్కువ కాలం ఆన్‌లో ఉంచలేరు.
కాబట్టి దీని కోసం మీరు ముందుగా మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లోని సెట్టింగ్స్‌కు వెళ్లిన తరువాత కాల్ సెట్టింగ్స్( Call Settings ) లేకుంటే సెర్చ్‌లో కాల్ సెట్టింగ్స్ అని టైప్ చేసి సెర్చ్ చేయాలి.
అప్పుడు వచ్చిన కాల్ సెట్టింగ్స్ ఆప్షన్ ఎంచుకుంటే దానిలో కాలర్ ఐడీ అండ్ స్పామ్ ప్రొటెక్షన్( Caller ID And Spam Protection ) ఆప్షన్ కనిపిస్తుంది.
ఈ ఎంపిక ఆఫ్‌లో ఉంటే మీరు దానిని ఆన్ చేయవలసి ఉంటుంది.తద్వారా మీరు స్పామ్ కాల్స్ సమస్య నుంచి బయటపడతారు.
"""/" /
ఈ సెట్టింగ్‌ను మార్చిన తర్వాత ఏం జరుగుతుంది అంటే, అప్పటివరకు ఉన్న స్పామ్ కాల్‌లు కూడా సహజంగానే బ్లాక్ చేయబడతాయి.
అయితే అప్పటికే స్పామ్‌గా గుర్తించబడని ఫోన్ నంబర్లు మాత్రం బ్లాక్ చేయబడవు.కాబట్టి అది పెద్ద సమస్యేమి కాదుగానీ, ఇకపై మీకు ఎటువంటి అనవసరమైన కాల్స్ వస్తే మాత్రం వాటిని నియంత్రించవచ్చు.
తద్వారా మీరు మీ ఫోన్ అద్భుతమైన పని తీరుని గమనిస్తారు.ఇకపోతే ప్రతి ఏటా మనదేశంలో ఇలాంటి ఫేక్ కాల్స్ బారిన పడి పెద్దమొత్తంలో చదివించేస్తున్నారని వినికిడి.
ఎందుకంటే సైబర్ కేటుగాళ్లు ఈమధ్య ఇలాంటి కాల్స్ చేసి ఎక్కువగా అమాయక జనాలను మోసం చేస్తున్నారు మరి!.
జుట్టు రాలడం తగ్గి దట్టంగా పెరగాలా.. అయితే ఈ ఆయిల్ మీకోసమే!