కార్తీక మాసం పూర్తయిన తర్వాత అమావాస్య మరుసటి రోజు ఇలా చేస్తే అంత పుణ్యం లభిస్తుందా..

ప్రస్తుతం మన దేశవ్యాప్తంగా చాలా మంది ప్రజలు కార్తీకమాసాన్ని తమ కుటుంబ సభ్యులందరితో కలిసి సంతోషంగా జరుపుకుంటున్నారు.

కార్తీక మాసం పూర్తయిన తర్వాత పాండ్యమి రోజు దీపాలను వెలిగించి నీటిలో వదులుతారు.

ఇంతకీ పాండేమీ రోజు దీపాలు ఎందుకు వెలిగిస్తారు ఇప్పుడు తెలుసుకుందాం.చాలా సంవత్సరాల క్రితం ఒక గ్రామంలో ఒక ఉమ్మడి కుటుంబంలో ఐదుగురు కోడళ్ళు ఎంతో సంతోషంగా ఉండేవారు.

వారిలో చిన్న కోడలు పోలీకి చిన్నప్పటి నుంచి దైవభక్తి ఎక్కువ అవ్వడం ఎక్కువగా ఉండటం వల్ల అత్తగారికి చిన్న కోడలు నచ్చేది కాదు.

అందుకే కార్తీక మాసంలో చిన్న కోడలిని కాదని మిగతా కోడల్ని తీసుకొని పిలుచుకొని నది స్నానానికి వెళ్లి దీపాలను వెలిగించి ఇంటికి వచ్చేవారు.

చిన్న కోడలు మాత్రం అలాంటివేమీ పట్టించుకోకుండా పెరట్లోని పత్తి చెట్టు నుంచి కాస్త పత్తి తీసుకొని కవ్వానికి ఉన్న వెన్నెను తీసి పత్తికి రాసి దీపం వెలిగించేసేది.

ఆ దీపం ఎవరి కంటపడకుండా దానిపై బుట్ట బోర్లించేసేది.కార్తీక మాసం చివరి దశకు వచ్చినప్పుడు నదీ స్నానం చేసి దీపాలను వదిలేందుకు పోలి అత్తగారు నలుగురు కోడళ్లను పిలుచుకొని వెళ్ళింది.

అలా వెళ్తూ వెళ్తూ చిన్న కోడలికి దీపాలు వెలిగించే సమయం లేకుండా తీరిక లేనన్ని పనులను అప్పగించి వెళ్ళింది.

"""/"/ పోలీ ఎప్పటి లాగానే ఇంటి పనులు చకచగా పూర్తిచేసి కార్తీకదీపం వెలిగించింది.

అయితే ఎన్ని ఆటంకాలు ఎదురైనా పోలీ భక్తి మార్గం తప్పకపోవడం చూసి దేవతలంతా దీవించారు.

ఆమె ప్రాణాలతో ఉండగానే స్వర్గానికి తీసుకెళ్లేందుకు పుష్పక విమానంలో దేవదూతలు వచ్చారు.ఆ సమయంలోనే ఇంటికి వచ్చిన అత్తగారు మిగతా కోడళ్ళు విమానాన్ని చూసి అది వారి కోసమే వచ్చిందేమో అని మురిసిపోయారు.

కానీ అందులో పోలీ ఉండేసరికి నిర్ధాంత పోయారు.కార్తీక మాసంలో దీపాలను వెలిగించకపోయినా కనీసం ఈ ఒక్కరోజు 30 ఒత్తులతో దీపాన్ని వెలిగించి అరటి దోప్పల్లో వదిలితే నెలరోజుల పుణ్యం దక్కుతుందని వేద పండితులు చెబుతారు.

వరుస పర్యటనతో పవన్ బిజీ బిజీ .. నేడు ఉత్తరాంధ్రకు