White Hair : డైయింగ్ తో పని లేకుండా తెల్ల జుట్టును నల్లగా మార్చాలనుకుంటే ఇలా చేయండి!

వయసుతో సంబంధం లేకుండా ప్రస్తుత రోజుల్లో ఎంతో మంది తెల్ల జుట్టు సమస్య( White Hair )తో ఇబ్బంది పడుతున్నారు.

తెల్ల జుట్టు అందాన్ని తగ్గిస్తుంది.ముసలి వారిలా కనిపించేలా చేస్తుంది.

అందుకే చాలా మంది తెల్ల జుట్టును ఇష్టపడరు.వైట్ హెయిర్ ని కవర్ చేసుకునేందుకు తరచూ డైయింగ్ చేయించుకుంటూ ఉంటారు.

కానీ ఆర్టిఫిషియల్ కలర్స్ జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.అందుకే డైయింగ్ తో పని లేకుండా సహజంగా తెల్ల జుట్టును నల్లగా మార్చుకునేందుకు కొందరు ప్రయత్నిస్తూ ఉంటారు.

"""/" / మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే మీకు ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ ఎంతో అద్భుతంగా సహాయపడుతుంది.

ఈ రెమెడీతో చాలా సులభంగా తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

ముందుగా స్టవ్ ఆన్ చేసి ఐరన్ కడాయి పెట్టుకుని అందులో నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్లు ఆవ నూనె ( Mustard Oi )వేసుకోవాలి.

ఆయిల్ కాస్త హీట్ అవ్వగానే అందులో వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసి నల్లగా మారేంత వరకు వేయించాలి.

పూర్తిగా పసుపు నల్లగా మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. """/" / ఇప్పుడు ఈ మిశ్రమంలో రెండు టేబుల్ స్పూన్లు హెన్నా పౌడర్( Henna Powder ) వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్, వన్ టేబుల్ స్పూన్ ఆవ నూనె వేసుకుని అన్నీ కలిసేలా మిక్స్ చేసుకోవాలి.

బాగా కలిపిన తర్వాత గంట పాటు నానబెట్టుకోవాలి.అనంతరం తయారు చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

గంట పాటు హెయిర్ ప్యాక్ ను ఉంచుకొని అప్పుడు తేలికపాటి షాంపూ తో తలస్నానం చేయాలి.

వారానికి ఒక్కసారి ఈ రెమెడీని ఫాలో అయ్యారు అంటే సహజంగానే మీ తెల్లటి కురులు నల్లగా మారతాయి.

వైట్ హెయిర్ సమస్యతో బాధపడుతున్న వారికి ఈ రెమెడీ చాలా హెల్ప్ ఫుల్ గా ఉంటుంది.

పైగా ఈ రెమెడీ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.కాబట్టి డైయింగ్ తో పని లేకుండా తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవాలి అనుకుంటే తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న రెమెడీని ప్రయత్నించండి.

మంచి రిసల్ట్ మీ సొంతం అవుతుంది.

తెలుగు ఇండస్ట్రీకి దిష్టి తగిలిందా…వరుస వివాదాలలో టాలీవుడ్ సెలబ్రిటీస్!