న్యూ ఇయర్ పార్టీలో సూపర్ గ్లోయింగ్ గా మెరిసిపోవాలనుకుంటే ఇలా చేయండి!
TeluguStop.com
మరికొన్ని గంటల్లో న్యూ ఇయర్ రాబోతోంది.ఈ నైట్ కి ఎంత హడావుడి ఉంటుందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు.
ముఖ్యంగా యువత పార్టీలు చేసుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తుంటారు.అయితే న్యూ ఇయర్ పార్టీలో సూపర్ గ్లోయింగ్ గా మెరిసిపోవాలని అమ్మాయిలు తెగ ఆరాటపడుతుంటారు.
అయితే అలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ చాలా అద్భుతంగా సహాయపడుతుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు బంగాళదుంప(Potato) స్లైసెస్, రెండు బీట్ రూట్(Beetroot) స్లైసెస్, రెండు టమాటో(Tomato) స్లైసెస్ మరియు రెండు లెమన్(Lemon) స్లైసెస్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి జ్యూస్ ను ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి.ఈ జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టి, వన్ టేబుల్ స్పూన్ శనగపిండి, హాఫ్ టీ స్పూన్ తేనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని పదిహేను నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.
"""/" /
ఆపై చర్మాన్ని వాటర్ తో శుభ్రంగా కడిగి మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోవాలి.
ఈ సింపుల్ రెమెడీని పాటించడం వల్ల చర్మం లోతుగా శుభ్రం అవుతుంది.మురికి, మృత కణాలు తొలగిపోతాయి.
బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ వంటివి రిమూవ్ అవ్వడమే కాకుండా టాన్ కూడా పోతుంది.
నిమిషాల్లో మీ ముఖం తెల్లగా కాంతివంతంగా మారుతుంది. """/" /
పార్లర్ గ్లో పొందడానికి ఈ హోమ్ రెమెడీ ఒక బెస్ట్ అండ్ సేఫ్ ఆప్షన్ అనడంలో ఎటువంటి సందేహం లేదు.
కాబట్టి అందమైన మెరిసే చర్మాన్ని కోరుకుంటే వెంటనే ఇప్పుడు చెప్పుకున్న రెమెడీని ప్రయత్నించండి.
అదిరిపోయే రిజల్ట్ మీ సొంతం అవుతుంది.
పెళ్లి పీటలపైనే ప్రాణాలు కోల్పోయిన వరుడు.. కంటతడి పెట్టిస్తున్న ఘటన!