ఇంట్లోనే సూపర్ సిల్కీ హెయిర్ ను పొందాలనుకుంటే ఇలా చేయండి!
TeluguStop.com
సాధారణంగా చాలా మంది సిల్కీ హెయిర్( Silky Hair ) ను ఇష్టపడుతుంటారు.
కానీ కఠినమైన షాంపూలను వినియోగించడం, హెయిర్ స్టైలింగ్ టూల్స్ ను అధికంగా వాడడం, పోషకాల కొరత, కాలుష్యం, వాతావరణంలో వచ్చే మార్పులు జుట్టును పొడిపొడిగా మారుస్తాయి.
ఇటువంటి హెయిర్ ను రిపేర్ చేసుకునేందుకు, సిల్కీ గా మెరిపించుకునేందుకు సెలూన్ లో వేలకు వేలు ఖర్చు పెట్టేవారు ఎందరో ఉన్నారు.
అయితే ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ అలాంటి వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
ఈ రెమెడీతో ఇంట్లోనే సులభంగా సూపర్ సిల్కీ హెయిర్ ను మీ సొంతం చేసుకోవచ్చు.
"""/" /
అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అర గ్లాసు వాటర్ పోసుకోవాలి.
వాటర్ బాగా బాయిల్ అయ్యాక రెండు టేబుల్ స్పూన్లు బియ్యం పిండి ( Rice Flour )వేసి గరిటెతో తిప్పుతూ దగ్గర పడే వరకు ఉడికించాలి.
ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఉడికించిన మిశ్రమాన్ని చల్లారబెట్టుకోవాలి.పూర్తిగా కూల్ అయ్యాక అందులో ఒక ఎగ్ ను బ్రేక్ చేసి వేసుకోవాలి.
అలాగే రెండు టేబుల్ స్పూన్లు పెరుగు( Curd ) , వన్ టీ స్పూన్ కోకోనట్ ఆయిల్ ( Coconut Oil )వేసి అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.
"""/" /
ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ళ నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.
45 నిమిషాల అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.
వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఈ రెమెడీని కనుక పాటిస్తే సహజంగానే మీ జుట్టు సిల్కీ గా, షైనీగా మారుతుంది.
బియ్యం పిండి, పెరుగు, ఎగ్ మరియు కోకోనట్ ఆయిల్.ఇవన్నీ జుట్టు ఆరోగ్యాన్ని పోషిస్తాయి.
జుట్టును దృఢంగా మారుస్తాయి.డ్రై హెయిర్ ను రిపేర్ చేస్తాయి.
కురులకు చక్కని తేమను అందిస్తాయి.హెయిర్ సిల్కీగా మెరిసేలా ప్రోత్సహిస్తాయి.
అలాగే ఇప్పుడు చెప్పుకున్న రెమెడీని ఫాలో అవ్వడం వల్ల జుట్టు రాలే సమస్య దూరం అవుతుంది.
హెయిర్ గ్రోత్ కూడా ఇంప్రూవ్ అవుతుంది.