చంద్రబాబు చెప్పినా వారు విన‌రా.. ఎందుకీ సైలెంట్‌..?

చంద్ర‌బాబు మార్క్ పాలిటిక్స్ అంటే మామూలు విష‌యం కాదు.ఎప్పుడు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చివ‌రి నిముషం దాకా సస్పెన్స్ గానే ఉంటుంది అలాంటి చంద్ర‌బాబుకు ఇప్పుడు గ‌డ్డు కాలం న‌డుస్తోంద‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే.

ఇలాంటి క్లిష్ట ప‌రిస్థితుల్లో ఇటు సొంత పార్టీ నేత‌లు కూడా ఆయ‌న త‌ర‌ఫున బ‌లంగా వాయిస్ వినిపించ‌ట్లేద‌నేది ఆయ‌న ఆవేద‌న.

ఇంత‌కు ముందు కూడా పార్టీ ప‌ర‌మైన ఎలాంటి కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌క‌పోయే స‌రికి చంద్ర‌బాబు వారికి చాలా సార్లు న‌చ్చ‌జెప్పి చూశారు.

అయినా వారిలో ఎలాంటి మార్పు రావ‌ట్లేదు.దీంతో చంద్రబాబు కూడా వారిని లైట్ తీసుకుంటున్నార‌ని తెలుస్తోంది.

మొన్న‌టికి మొన్న త‌న మాట‌ల్లో ఓ పెద్ద డైలాగ్ ను వ‌దిలారు.పార్టీకోసం కష్టపడే వారికే ఎలాంటి ప‌ద‌వులు అయినా ఇస్తాన‌ని, టికెట్లు కేటాయిస్తాన‌ని అంతేగానీ పార్టీ కోసం ప‌నిచేయ‌కుండా టికెట్లు అడిగితే ఇవ్వ‌బోనంటూ బ‌హిరంగంగానే ప్ర‌క‌టించారు.

చంద్ర‌బాబు ఇంత గ‌ట్టిగా వార్నింగ్ ఇస్తున్నా స‌రే చాలామంది మాత్రం త‌మ పంథాను మార్చుకోవ‌ట్లేదు.

ఇక ఈ నేప‌థ్యంలోనే వారు ఎంత‌లా సైలెంట్ అయిపోయారో మొన్న క్లారిటీగా క‌నిపించింది.

పార్టీ ప్ర‌ధాన ఆఫీసు మీద దాడి జ‌రిగినా లేదంటే చంద్ర‌బాబు ఫ్యామిలీని అవ‌మానించినా వారు మాత్రం నోరు మెద‌ప‌ట్లేదు.

"""/"/ ఇంత పెద్ద దాడులు, నింద‌లు వేస్తున్నా టీడీపీ నేత‌ల్లో మాత్రం చ‌ల‌నం రావ‌ట్లేదు.

మాకేంటి అన్న‌ట్టు సైలెంట్ గానే ఉంటున్నారు.దీంతో వారితో చంద్ర‌బాబుకు పెద్ద త‌ల‌నొప్పులు వ‌చ్చి ప‌డుతున్నాయి.

త‌మ పార్టీ ఆఫీసు మీద దాడి జ‌రిగిన‌ప్పున‌డు, అలాగే చంద్ర‌బాబును అవ‌మానించిన‌ప్పుడు పార్టీ ఆధ్వ‌ర్యంలో అనేక నిర‌స‌న‌లు తెలిపారు.

అయినా టీడీపీలో ఉన్న సైలెంట్ వాదులు మాత్రం తెర‌మీద‌కు రాలేదు.పార్టీ నిర‌స‌న‌ల్లో పాల్గొన‌లేదు.

ఈ సైలెంట్ వాదుల్లో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా అనేక మంది ఉన్నారు.

కామద ఏకాదశి రోజు పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే..!