ఢిల్లీకి రేవంత్ ..  మంత్రివర్గ విస్తరణలో వీరికే ఛాన్స్ ? 

పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ తనకు తిరుగులేకుండా చూసుకుంటూ వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) దానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు వ్యూహాలు రచిస్తూనే వస్తున్నారు.

తనకు సన్నిహితుడైన మహేష్ కుమార్ గౌడ్( Mahesh Kumar Goud ) కు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పీఠం దక్కేలా పావులు కదిపి సక్సెస్ అయ్యారు.

ఇక మంత్రివర్గ విస్తరణ పైన రేవంత్ ఫోకస్ చేశారు.ఈ మేరకు మరికొద్ది రోజుల్లోనే భట్టి విక్రమార్క,  మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి ఢిల్లీకి వెళ్లి అధిష్టానం పెద్దలని కలిసే ఆలోచనతో రేవంత్ ఉన్నారు.

పిసిసి కార్యవర్గం,  మంత్రివర్గ విస్తరణ పై అధిష్టానం పెద్దలతో రేవంత్ చర్చించనున్నారు.  ఈ మేరకు వచ్చేవారం ఢిల్లీకి( Delhi ) వెళ్ళనున్నట్లు సమాచారం.

ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఈనెల 15న తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినన్నారు.

దీనికి కాంగ్రెస్ అగ్ర నేతలను ఆహ్వానించేందుకు ఈరోజు ఆయన ఢిల్లీకి వెళ్తున్నారు. """/" / ఈ కార్యక్రమం తరువాత ఎప్పుడైనా రేవంత్ రెడ్డి బృందం ఢిల్లీకి వెళ్లే అవకాశం కనిపిస్తోంది.

మంత్రి పదవులు , పిసిసి అధ్యక్షుడు,  ఉపసభాపతి చీఫ్ విప్ ఇలా అన్ని పదవుల నియామకాల్లోనూ సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకోవాలని గతంలోనే ఒక నిర్ణయానికి వచ్చారు .

పిసిసి అధ్యక్షుడిగా బీసీ నేతకు అవకాశం ఇచ్చారు.పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, ప్రచార కమిటీ చైర్మన్ తదితర పదవులను ఇతర సామాజిక వర్గాలకు కేటాయించే అవకాశం ఉంది.

ఇక మంత్రివర్గ విస్తరణ పైన ఫోకస్ చేస్తున్నారు .రేవంత్ రెడ్డి కొత్తగా మరో ఆరుగురిని మంత్రివర్గంలోకి తీసుకునేందుకు అవకాశం ఉంది.

వీటిలో ఒకటి రెండు పెండింగ్ లో పెట్టి మిగిలినవి భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

"""/" / వాకటి శ్రీహరి ముదిరాజ్ (మక్తల్), పి సుదర్శన్ రెడ్డి (బోధన్), గడ్డం వివేక్ (చెన్నూరు ) లకు అవకాశం దక్కే ఛాన్స్ కనిపిస్తోంది.

ఇక ఎన్నికలకు ముందు పార్టీలో చేరే సమయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో తీసుకుంటామని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆయనకు ఇప్పుడు అవకాశం ఇస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది.

అలాగే మల్ రెడ్డి రంగారెడ్డి (ఇబ్రహీంపట్నం), టి రామ్మోహన్ రెడ్డి (పరిగి) లలో ఒకరికి మంత్రివర్గంలో ఛాన్స్ దక్కే అవకాశం ఉంది.

ఇక మైనార్టీ కోటలో షబ్బీర్ అలీ, అజారుద్దీన్ లలో ఒకరికి మంత్రి పదవి ఇచ్చి ఎమ్మెల్సీని చేస్తారనే ప్రచారం జరుగుతోంది.

వైరల్: ఎప్పుడూ రీల్స్ చూడడం కాదు, నేటితరం అంటే ఇలా ఉండాలి?