మౌని అమావాస్య విశిష్టత… చేయాల్సిన పనులు..!

ఈ ఏడాది మౌని అమావాస్య 2021 ఫిబ్రవరి 11 గురువారం అర్ధరాత్రి రోజున ప్రారంభమవుతుంది.

11వ తేదీ ప్రారంభమైన ఈ మౌని అమావాస్య 12వ తేదీ అర్ధరాత్రి 12:35 వరకు ఉంటుంది.

సాధారణంగా ప్రతి అమావాస్యకు భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ భగవంతుని పూజిస్తారు.

అదేవిధంగా ఈ మౌని అమావాస్య రోజు ఉదయమే నీటి కాలువలు వద్ద తలస్నానాలు ఆచరించి ఆ గంగాదేవికి పూజ చేయడం వల్ల సర్వ రోగాలు నయమవుతాయని భావిస్తారు.

ఈ మౌని అమావాస్య నుంచి మాఘమాసం ప్రారంభమవుతుంది కాబట్టి భక్తులు పెద్ద ఎత్తున మాఘస్నానాలు కూడా నిర్వహిస్తుంటారు.

తెల్లవారుజామున స్నానం పూర్తి అయ్యాక దేవాలయాలను దర్శించి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు.

ఉత్తర భారతదేశంలోని ప్రజలు ఈ అమావాస్యను మాఘ అమావాస్య అని పిలుస్తారు.ఈ మాఘ అమావాస్య రోజున రిషి జన్మించాడనీ చాలామంది విశ్వసిస్తారు.

ఈ విధంగా ఎవరి సాంప్రదాయం ప్రకారం వారు పూజలను నిర్వహించి అమావాస్య రోజు మౌన వ్రతం పాటిస్తారు.

ఈ మౌని అమావాస్య రోజు మౌన వ్రతం చేయటం వల్ల సత్యయుగంలో వేలాది సంవత్సరాల పాటు కాటిన్యం చేసిన ధర్మం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.

"""/"/ ఇకపోతే ఈ మౌని అమావాస్య రోజు ప్రతి ఒక్కరూ ఉపవాస దీక్షలతో వారి ఇష్టదైవానికి పూజలు చేసుకొని, వారి స్తోమతకు తగ్గట్టుగా దానధర్మాలను చేయాలి.

ముఖ్యంగా నువ్వులు, నల్ల బట్టలు, నూనె వంటి వస్తువులను దానం చేయటం వల్ల శుభం జరుగుతుంది.

అదేవిధంగా ఈ మౌని అమావాస్య రోజు సాక్షాత్తు ఆ విష్ణు భగవానుడికి నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల సకల సంపదలు కలుగుతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.

అయితే కొన్ని ప్రాంతాల వారు ఈ మాఘమాసం నెల మొత్తం వేకువజామునే చన్నీటితో స్నానం చేసి దేవాలయాలలో దీపాలు వెలిగించి పూజలు నిర్వహిస్తుంటారు.

అదే మరి మన టాలీవుడ్ కి బాలీవుడ్ కి ఉన్న అతిపెద్ద తేడా !