ఈ స్టార్ డైరెక్టర్లు ఇప్పటికైన మారాల్సిన అవసరం ఉందా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీ స్థాయి రోజురోజుకు పెరుగుతున్న కొద్దీ చాలామంది యంగ్ డైరెక్టర్లు గ్రాఫిక్స్ తో విజువల్ వండర్స్ ను క్రియేట్ చేయాలని చూస్తున్నారు.

ఇక అందులో భాగంగానే స్టార్ డైరెక్టర్లందరు తమదైన రీతిలో సత్తా చాటుతుంటే యంగ్ డైరెక్టర్స్ మాత్రం వాళ్లకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటు ముందుకు సాగుతున్నారు.

ఇక ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల నుంచి పాతుకుపోయిన గోపీచంద్ మలినేని,( Gopichand Malineni ) బాబి,( Bobby ) అనిల్ రావిపూడి( Anil Ravipudi ) లాంటి దర్శకులు రొటీన్ రొట్ట ఫార్ములా సినిమాలను చేస్తూనే వస్తున్నారు.

"""/" / మరి వీళ్ళు ఇప్పటికైనా వాళ్ళ వైఖరిని మార్చుకోవాల్సిన అవసరమైతే ఉంది.

ఇక కేవలం వీళ్ళ సినిమాల్లో నాలుగు కుళ్ళు జోకులు, మూడు పాటలు, ఐదు ఫైట్లతో సినిమాను లాగించేస్తున్నారు.

అందుకే స్టార్ హీరోల నుంచి వీళ్లకు ఆఫర్స్ అయితే రావడం లేదు.సీనియర్ హీరోలతో సినిమాలు చేసిన కూడా టైర్ వన్ హీరోలను మాత్రం టచ్ చేయలేకపోతున్నారు.

కారణం ఏంటి అంటే రొటీన్ రొట్ట ఫార్ములా సినిమాలను చేస్తూ కమర్షియల్ డైరెక్టర్లుగా పేర్లు సంపాదించుకోవడమే వీళ్ళు చేసిన తప్పని చెప్పాలి.

"""/" / ఆ జానర్ లో నుంచి బయటికి వచ్చి కొంచెం ఎక్స్పరమెంటల్ సినిమాలను చేసి సక్సెస్ సాధించొచ్చు కదా అనే ధోరణిలో మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.

మరి ఇప్పటికైనా వీళ్ళ వైఖరిని మార్చుకుంటే మంచిది లేకపోతే వీళ్లకు ఇండస్ట్రీలో ఎక్కువ కాలం పాటు కొనసాగే అవకాశం అయితే లేదు అంటూ మరి కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తూ ఉండడం విశేషం.

ఇక ఇప్పటివరకు వీళ్ళు చేసిన సినిమాలు ఒకెత్తైతే ఇకమీదట చేయబోయే సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి.

ఇక ఇప్పుడు యంగ్ డైరెక్టర్స్ నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకొని నిలబడాలంటే వీళ్ళు చాలా కసరత్తులు చేయాల్సిన అవసరమైతే ఉంది.

పట్టపగలు జలపాతం ఒడ్డున దెయ్యాలు ప్రత్యక్షం.. వీడియో చూస్తే జడుసుకుంటున్నారు..