బ‌రువు త‌గ్గాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న వారు ఏయే కూర‌గాయ‌లు తినాలో తెలుసా?

అధిక బ‌రువు.ప్ర‌స్తుత రోజుల్లో కోట్లాది మందిని క‌ల‌వ‌ర పెడుతున్న స‌మ‌స్య ఇది.

బ‌రువు పెర‌గ‌డానికి కార‌ణాలు అనేకం.అలా అని పెరిగితే పెరిగాములే అని నిర్ల‌క్ష్యం చేస్తే.

చూసేందుకు లావుగా క‌నిపించ‌మే కాదు మ‌ధుమేహం, గుండె పోటు, బీపీ, క్యాన్స‌ర్ వంటి వ్యాధులు వ‌చ్చే ప్ర‌మాదం భారీగా పెరిగిపోతుంది.

అందుకే ఏ కార‌ణం చేత పెరిగినా.ఖ‌చ్చితంగా బ‌రువును అదుపులోకి తెచ్చుకోవాల్సిందే.

ఈ నేప‌థ్యంలోనే చాలా మంది వెయిట్ లాస్ అవ్వ‌డానికి విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

అయితే అలాంటి వారికి కొన్ని కొన్ని కూర‌గాయ‌లు చాలా బాగా స‌హాయ‌ప‌డ‌తాయి.మ‌రి ఆ కార‌గాయ‌లు ఏంటీ.

? అస‌లు వాటిని తీసుకోవ‌డం వ‌ల్ల వ‌చ్చే లాభాలు ఎలా ఉంటాయి.? వంటి విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ట‌మాటో.రోజూవారీ వంట‌ల్లో విరి విరిగా దీనిని వాడుతుంటారు.

చ‌క్క‌టి రుచిని క‌లిగి ఉండే ట‌మాటోలో పోష‌కాలు మెండుగా ఉంటాయి.అవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

ముఖ్యంగా బ‌రువు త‌గ్గాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న వారు రెగ్యుల‌ర్‌గా ఒక ట‌మాటోను తీసుకోవాలి.లేదా వారంలో మూడు సార్లు టమాటో జ్యూస్ అయినా సేవించాలి.

త‌ద్వారా వేగంగా వెయిట్ లాస్ అవుతారు.గుమ్మ‌డికాయ‌.

బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు త‌ప్ప‌కుండా దీనిని తీసుకోవాలి.గుమ్మ‌డికాయ‌లో ఉండే ప్ర‌త్యేక సుగుణాలు శరీరంలో పేరుకుపోయిన కొవ్వును సూప‌ర్ ఫాస్ట్‌గా క‌రిగించి బ‌రువును త‌గ్గిస్తాయి.

చిక్కుడుకాయ‌లు.చాలా మంది వీటిని ఇష్టంగా తింటుంటారు.

రుచిలోనే కాదు మన శరీరానికి ఇవి బోలెడు పోషకాలను అందిస్తాయి.అలాగే వెయిట్ లాస్ కు గ్రేట్ గా స‌హాయ‌ప‌డ‌తాయి.

వారంలో రెండు, మూడు సార్లు చిక్కుడుకాయ‌ల‌ను తీసుకుంటే మీ శ‌రీర బ‌రువు చాలా త్వ‌ర‌గా అదుపులోకి వ‌స్తుంది.

"""/"/ ఇక ఇవే కాకుండా బ్రోకలీ, చిల‌క‌డ‌దుంప‌లు, కీర‌, ఉల్లిపాయ‌, పాల‌కూర‌, క్యారెట్‌, క్యాప్సిక‌మ్‌, ముల్లంగి వంటివి కూడా బ‌రువును సూప‌ర్ ఫాస్ట్‌గా త‌గ్గించ‌గ‌ల‌వు.

కాబ‌ట్టి, అధిక బ‌రువు వ‌దిలించుకోవాల‌ని భావిస్తున్న వారు వీటిని డైట్‌లో చేర్చుకుంటే మంచిద‌ని నిపుణులు చెబుతున్నారు.

వైసీపీ ఓటమి తర్వాత మొదటిసారి స్పందించిన యాంకర్ శ్యామల.. తప్పు తెలుసుకున్నట్టేనా?