పాదయాత్రలు చేసి ప్రజా సమస్యలు తెలుసుకోండి.. కేసీఆర్ కీలక ఆదేశాలు
TeluguStop.com
హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ తమ పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించారు.
ఈ భేటీలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు జిల్లా అధ్యక్షులు తదితరులు హాజరైయ్యారు.
ఈ సందర్భంగా పార్టీ ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు.రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు ఉండవని కేసీఆర్ తెలిపారు.
షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయన్నారు.ఈ నేపథ్యంలో బీజేపీని ఎదుర్కొనేందుకు నేతలందరూ సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు.
బీజేపీ సభలకు కౌంటర్ సభలు పెట్టాలని చెప్పారు.బీజేపీ విమర్శలను బలంగా తిప్పికొట్టాలన్న కేసీఆర్ ఎన్నికల వరకు ప్రజల్లోనే ఉండాలని సూచించారు.
అదేవిధంగా ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు పాదయాత్రలు చేయాలని వెల్లడించారు.నియోజకవర్గాల వారిగా సభలు పెట్టాలని స్పష్టం చేశారు.
పాన్ ఇండియా సినిమాలు చేయడం అందరి హీరోల వల్ల అవ్వదా..?