మనం ప్రతిరోజూ ఇంట్లో పూజ చేసుకుంటాం.చాలా మంది ఇంట్లోని దేవుడి గదిలో ఫొటోలు, విగ్రహాలు పెట్టుకుంటారు.
కొందరు చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకుంటే మరికొందకు పెద్దవి పెట్టుకుంటారు.కానీ పెద్ద పెద్ద విగ్రహాల కంటే చిన్న విగ్రహాలు వాడటమే మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
H3 Class=subheader-styleపూజకు ఎలాంటి విగ్రహాన్ని వాడాలి?/h3p
మన ఇంట్లో నిత్యం చేసుకొనే పూజలకు బొటనవేలికి మించకుండా విగ్రహాలు ఉండేలా చూసుకోవాలి.
వ్రతాలు వంటివి చేసేటప్పుడు మాత్రం అరచేతిని మించకుండా విగ్రహాలు ఉండేలా చూసుకోవడం మంచిది.
ఎంతపెద్ద విగ్రహం ఉంటే ఆ విగ్రహం పరిమాణం ప్రకారంగా రోజూ ఆ స్థాయిలో ధూపదీప నైవేద్యములు జరగాలి గనక సాధారణంగా ఇంట్లో చేసుకొనే పూజకు అరచేతికి మించకుండా విగ్రహం వాడటం మంచిది.
పూజలో మట్టి విగ్రహం గానీ, పంచలోహములతో చేసిన విగ్రహాలను మాత్రమే వాడాలి.అంటే వెండి, బంగారు, ఇత్తడి వంటి విగ్రహాలను కూడా వాడొచ్చు.
"""/" /
ప్రతిరోజూ కాకపోయినా పూజ చేసినప్పుడు దేవుడికి ముందుగా బొట్టు పెట్టాలి.
అనంతరం పూలు పెట్టి.దీపం వెలిగించాలి.
ఆ తర్వాత అగరువత్తులు వెలిగించి. నైవేద్యంగా ఏ పండో, ఫలమో కచ్చితంగా పెట్టాలి.
ఇంట్లో ఎలాంటి పండ్లు లేకపోతే.కనీసం చక్కెర, తేనె, బెల్లం పప్పుతో కలిపి పెట్టుకోవచ్చు.
ఆ తర్వాత దేవుడి ముందు కూర్చొని ప్రశాంతంగా మొక్కుకోవాలి.వీలయితే దేవుడికి సంబంధించిన పాటలో, శ్లోకాలో, మంత్రాలో చదివితే మరీ మంచిది.
అంత సమయం లేదనుకుంటే మనసు దేవుడి మీదే లగ్నం చేసి దండం పెట్టుకున్నా సరిపోతుంది.