ఫుడ్ లో ఇలాంటి కాంబినేషన్స్ అసలు ట్రై చేయొద్దు…! ఎందుకంటే…?!

మనం రోజు వారి దిన చర్యలో భాగంగా రోజుకి కనీసం మూడు సార్లు భోజనం చేస్తూనే ఉంటాం.

ఇంట్లోనో లేకపోతే బయట ఆఫీసులోనో, లేకపోతే మరేదో ప్లేస్ లోనో తింటూ ఉంటాం.

అయితే ఇందులో కొన్ని ఆహారపు అలవాట్ల ద్వారా అనారోగ్యాల పాలు అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

అవేమిటంటే.మొదటగా చెప్పుకోవాల్సింది అన్నం తినే సమయంలో నీళ్లను తాగడం.

నిజానికి ఇది అస్సలు మంచి పద్ధతి కాదు.అన్నం తినే సమయంలో కేవలం ఆహార పదార్థాలు మాత్రమే కలిపి తీసుకోవడం చాలా మంచిది.

అన్నం పూర్తిగా తిన్న తర్వాతనే నీరు తీసుకోవడం ఎంతో శ్రేయస్కరం.ఇక మరో కాంబినేషన్ చూస్తే.

భోజనంతో పాటు పండ్లను తీసుకోవడం.అది ఎలా అంటే పెరుగన్నం తినే సమయంలో అరటిపండును అందులో తినడం, అలాగే అన్నం తిన్న వెంటనే పండ్లను తినడం అంత మంచి అలవాటు కాదు.

ఇలా భోజనం చేసిన వెంటనే పండ్లను తీసుకోవడం ద్వారా ఆ పండులో ఉండే పోషక విలువలు శరీరానికి పూర్తిగా అందవు.

భోజనం చేసిన గంట తర్వాత ఆ పండ్లను తీసుకుంటే ఎంతో మేలు కూడా.

ఇక అలాగే అరటి పండ్లు, పాలను కలిపి తీసుకోవడం అంత శ్రేయస్కరమైన విషయం కాదు.

ఈ రెండింటినీ ఒకే సారి తీసుకోవడం ద్వారా కొన్ని జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం లేకపోలేదు.

పాలల్లో లాక్టోస్ అనే ఎంజైమ్ ఉండటం ద్వారా శరీరంలో పాలు అంత సులువుగా అరగవు.

కాబట్టి, పాలు తాగిన ఒక గంట సమయం గడిచిన తర్వాత పండ్లను తీసుకోవడం ద్వారా మేలు చేకూరుతుంది.

ఇలా తినడం ద్వారానే ఆ పండు లోని పూర్తి పోషక విలువలు లభిస్తాయి.

ఇక మరో కాంబినేషన్ భోజనం చేసిన వెంటనే టీ తాగే అలవాటు ఉండటం.

దీనివల్ల టీ తాగడం ద్వారా ఉండే టానిన్స్ మనం తీసుకునే ఆహారం లో ఉన్న ఐరన్ పోషక విలువలు శరీరానికి ఉపయోగపడకుండా అడ్డుకుంటుంది.

కాబట్టి భోజనం చేసిన తర్వాత కనీసం గంట లేదా రెండు గంటల తర్వాత టీ తీసుకుంటే మంచిది.

అలాగే కూల్ డ్రింక్స్ తో పాటుగా చీజ్ తీసుకోవడం.చీజ్ తో తయారు చేసిన ఆహార పదార్థాలను తినే సమయంలో అస్సలు కూల్ డ్రింక్స్ వాడనే వాడకూడదు.

కూల్ డ్రింక్స్ లో ఉండే కార్బొనేటెడ్ వల్ల పొట్టలో కాస్త ఇబ్బందులు కలగజేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

అంతేకాకుండా అందులో ఉండే చక్కెర పదార్థాల వల్ల లావు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

థియేటర్లలో యావరేజ్ బుల్లితెరపై అదుర్స్.. గుంటూరు కారం మూవీ టీఆర్పీ లెక్క ఇదే!