ఉదయాన్నే ఖాళీ కడుపుతో వీటిని అస్సలు తీసుకోకండి.. తీసుకుంటే తర్వాత బాధపడతారు..

ప్రపంచవ్యాప్తంగా దాదాపు చాలామంది ప్రజలు ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసి వారి ఉద్యోగాలకు కానీ, పనులకు కానీ వెళుతూ ఉంటారు.

ఉదయం మనం తీసుకునే ఆహారం మన ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం.అవును ఉదయం పూట ఏది తిన్నా అది మన ఆరోగ్యం పై ఎంతో ప్రభావం చూపుతుంది.

మనం రోజు ఉదయాన్నే వేయించిన ఆహారంతో బ్రేక్ఫాస్ట్ చేస్తే అది మన జీర్ణ వ్యవస్థ పనితీరును తగ్గిస్తుంది.

అంతేకాకుండా ఇలాంటివి మన మానసిక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతిస్తాయి.ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఏ ఆహార పదార్థాలను తీసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రతిరోజు ఉదయం ఖాళీ కలుపుతూ కాఫీ లేదా టీ త్రాగడం అంత మంచిది కాదు.

అయితే మీరు ఇప్పటికీ కాఫీ లేదా టీ తాగాలనుకుంటే మీరు పరాటా, బ్రెడ్ లేదా బిస్కెట్ తినడం మంచిది.

లేకపోతే మీ జీర్ణ వ్యవస్థ బలహీనపడే అవకాశం ఉంది.అందుకే ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తాగడం అంత మంచిది కాదు.

మరి కొంతమంది వారి ఫిట్నెస్ కారణంగా ఉదయం ఖాళీ కడుపుతో సలాడ్ తినడం మొదలుపెడతారు.

అయితే సాలాడ్ తినడానికి ఉత్తమమైన సమయం మధ్యాహ్నం మాత్రమే.అందువల్ల ఉదయం ఖాళీ కడుపుతో సాలాడ్ తింటే ఎన్నో ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

అంతేకాకుండా ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఆపిల్ తింటే మీకు ఆరోగ్యానికి హాని జరిగే ప్రమాదం ఉంది.

"""/"/ మీరు చదివింది నిజమే ఆపిల్ జీర్ణం కావడానికి ఒకటి లేదా రెండు గంటలు పడుతుంది.

అలాంటి పరిస్థితుల్లో ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఆపిల్ తింటే జీర్ణం వ్యవస్థ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

కొంతమంది ఖాళీ కడుపుతో లస్సీ తాగడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు.కానీ ఇలా చేయడం వల్ల మీ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది.

కాబట్టి ఇలాంటి ఆహారాలకు ఉదయం ఖాళీ కడుపుతో తినకుండా దూరంగా ఉండటమే మన ఆరోగ్యానికి ఎంతో మంచిది.

Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసు.. నిందితుల కస్టడీ పిటిషన్ పై తీర్పు