అభివృద్ది పనుల్లో నాణ్యత లోపించొద్దు: మంత్రి ఉత్తమ్
TeluguStop.com
సూర్యాపేట జిల్లా: హుజూర్ నగర్,కోదాడ నియోజకవర్గాల్లో ఇటీవల శంకుస్థాపన చేసిన ఆర్ అండ్ బి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర భారీ నీటిపారుదల, ఆహార,పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్‌లోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డితో కలిసి రెండు నియోజకవర్గాల అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ చేపడుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపాలు లేకుండా చూడాలని సూచించారు.
ప్రస్తుతం జరుగుతున్న పనులతో పాటు ఈనెల 19న శంఖుస్థాపన చేసిన ఆర్ అండ్ బి పనులు, నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని,మంజూరైన రోడ్లకు త్వరగా టెండర్లు పిలవాలని ఆదేశించారు.
అనంతగిరి- చనుపల్లి డబుల్ రోడ్డు రూ.20 కోట్లు,బరాఖత్‌గూడెం-కాగిత రామచంద్రాపురం డబుల్ రోడ్డు రూ.
20 కోట్లు,ఎన్ హెచ్ 65 మొద్దులచెరువు-మోతె వరకు డబుల్ రోడ్డు రూ.25 కోట్లు, మల్లారెడ్డిగూడెం,రేవూరు మీదుగా రామాపురం వరకు డబుల్ రోడ్డు రూ.
20 కోట్లు, అమరవరం-అలింగాపురం డబుల్ రోడ్డు రూ.23 కోట్లు, నేరేడుచర్ల-దూపాడు డబుల్ రోడ్డు రూ.
26 కోట్ల రోడ్ల పనులతో పాటు,కొత్తగా ఏర్పడిన అనంతగిరి, పాలకవీడు,చింతలపాలెం మండలాల్లో మంజూరు చేయించిన తహశీల్దార్, ఎంపీడీఓ,పోలీస్ స్టేషన్ నూతన భవనాలకు వెంటనే నిర్మాణ పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఆర్ అండ్‌బి సీఈ మోహన్ నాయక్,సిఈ రాజేశ్వర్ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.
అమెరికా వీధుల్లో మత్తులో ఊగిన భారతీయ మహిళ.. నల్లజాతి మహిళను ఏమందో తెలుసా?