రేపే మహాశివరాత్రి... పొరపాటున కూడా ఈ పనులు అసలు చేయకండి?

హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏడాది మహాశివరాత్రి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు.

ఈ క్రమంలోనే ఈ ఏడాది మార్చి ఒకటో తేదీ శివరాత్రి పండుగ రావడంతో పెద్ద ఎత్తున భక్తులు ఉపవాస జాగరణలతో స్వామి వారికి అభిషేకం చేసి స్వామి వారి పూజా కార్యక్రమాలలో పాల్గొంటారు.

అయితే స్వామి వారి పూజా కార్యక్రమాలలో పాల్గొన్న సమయంలో చాలా మంది వారికి తెలియకుండానే ఎన్నో పొరపాట్లు చేస్తూనే ఉంటారు.

ఈ విధంగా మహాశివరాత్రి రోజు స్వామివారికి భక్తిశ్రద్ధలతో ఉపవాసం చేసే జాగరణ చేస్తున్న సమయంలో కొందరు కొన్ని పొరపాట్లు చేస్తుంటారు.

మరి ఏ విధమైనటువంటి తప్పులను చేయకూడదు అనే విషయానికి వస్తే.స్వామి వారు అభిషేక ప్రియుడు అనే విషయం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే స్వామివారికి అభిషేకం చేయడం వల్ల స్వామివారు ప్రీతి చెంది మన కోరికలు నెరవేరుస్తాడని చాలా మంది భావిస్తుంటారు.

అయితే స్వామి వారికి అభిషేకం చేసే సమయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలి.స్వామివారికి బిల్వ పత్రాలతో అభిషేకం చేయడం వల్ల ఎంతో ప్రీతి చెందుతారు.

అయితే ఈ బిల్వదళాలతో అభిషేకం చేసే సమయంలో పొరపాటున కూడా తులసి దళాలను కలపకూడదు.

తులసి దళాలు పరమేశ్వరుడి పూజకు అనర్హం.అదే విధంగా చాలామంది ప్యాకెట్ పాలతో స్వామివారికి అభిషేకం చేస్తారు పొరపాటున కూడా ఇలా చేయకూడదు.

"""/" / అలాగే స్వామివారికి పసుపు కుంకుమలను సమర్పించి పూజ చేయకూడదు.ముఖ్యంగా స్వామివారి పూజలో శంఖం ఉపయోగించ కూడదని పండితులు చెబుతున్నారు.

ఈ జాగ్రత్తలను పాటిస్తూ స్వామి వారికి ఉపవాస దీక్షలు చేస్తూ పూజ చేయాలి మహా శివరాత్రి పండుగ మంగళవారం 1వ తేదీ తెల్లవారుజామున 3.

16 గంటలకు మొదలవుతోంది.మార్చి 2వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు మహాశివరాత్రి ముగియనుంది.

కనుక తెల్లవార్లు జాగరణ చేసేవారు వినోదాలతో జాగరణ చేస్తూ కాలక్షేపం చేయకుండా ఆ శివనామస్మరణతో శివయ్య భజన పాటలు పాడుతూ స్వామివారి పూజలో ఉండి జాగరణ చేయడం వల్ల మంచి ఫలితం కలుగుతుంది.

21వ రోజుకు సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర