పిల్లల కిడ్నాప్ చేసే వారంటూ దాడులు చేయొద్దు:జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే
TeluguStop.com
సూర్యాపేట జిల్లా:చిన్న పిల్లలను కిడ్నాప్ చేసే గ్యాంగ్ లు వచ్చాయని కొద్దిరోజులుగా పుకార్లు వస్తున్నాయి.
ఇలాటివి వాటిని ప్రజలు నమ్మవద్దు.ఇది పుకారు మాత్రమే,దీనిలో వాస్తవం లేదు.
జిల్లా పోలీసు పటిష్ట నిఘా ఉంచిందని జిల్లా ఎస్పి రాహుల్ హెగ్డే( District SP Rahul Hegde ) ఒక ప్రకటనలో తెలిపారు.
ఆదివారం కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్( Kodada Rural Police Station ) పరిధిలోని తొగర్రాయి గ్రామంలో ప్రజలు అనుమానంతో ఒక వ్యక్తిపై దాడి చేసి పట్టుకుని దేహశుద్ది చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారని,కోదాడ రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అనుమానిత వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా అతని మానసికస్థితి సరిగాలేదని తెలిసిందని,పుకార్లు సృష్టించి ప్రజల్లో భయాందోళనలు కలిగించవద్దని కోరారు.
ప్రజలు, తల్లిదండ్రులు పుకార్లను నమ్మవద్దని,అనుమానిత వ్యక్తులు కనిపిస్తే స్థానిక పోలీసు అధికారులకు,డయల్ 100 కు,సూర్యాపేట జిల్లా( Suryapet District ) పోలీసు స్పెషల్ బ్రాంచ్ కంట్రోల్ నంబర్ 8712686026 తెలపాలని సూచించారు.
అనుమానంతో ఎవ్వరిపై కూడా భౌతిక దాడులకు .
మెగా హీరోలకు పోటీగా నందమూరి హీరోలు… లెక్క పెరుగుతుందిగా!