వీరి నుంచి ఎప్పటికీ కూడా ఆహారం తీసుకోకండి.. గరుడ పురాణం ప్రకారం తెలిసిందేంటంటే..?
TeluguStop.com
హిందూ సాంప్రదాయంలో గరుడ పురాణానికి( Garuda Puranam ) ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.
వేద వ్యాసుడు రచించిన ఈ పురాణాన్ని చదవడం వలన మానవ జీవితానికి ఎన్నో అవసరమైన చాలా మంచి సమాచారాన్ని పొందవచ్చు.
అయితే గరుడ పురాణం ప్రకారం మనం పాపుల నుంచి ఆహారం తీసుకుంటే వారి పాపాలలో ( Sins ) మనం కూడా పాలుపంచుకున్నట్టే.
అందుకే ఎవరి నుంచి ఆహారం( Food ) తీసుకుంటే మనకు పాపము అంటుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
గరుడ పురాణం ప్రకారం నేరస్తుడిగా ఓ వ్యక్తి న్యాయస్థానంలో లేదా చట్టం ద్వారా దోషిగా తేలితే, ఆ వ్యక్తి నుంచి అస్సలు ఆహారం తీసుకోకూడదు.
ఎందుకంటే అన్యాయం చేసిన వ్యక్తి చేతి నుండి ఆహారం తీసుకుంటే అతని పాపంలో మనం పాలుపంచుకున్నట్టు.
నేరస్తుడి నుంచి ఆహారం తీసుకోవడం వలన మన వ్యక్తిగత జీవితాలపై కూడా చెడు ప్రభావం పడుతుంది.
ఇక ఈ మధ్యకాలంలో చాలా మంది డబ్బులు వడ్డీకి అప్పుగా ఇస్తున్నారు. """/" /
అయితే ఇలా వడ్డీకి డబ్బులు తీసుకున్న వాళ్ళు అవతల వ్యక్తి పరిస్థితి చూడకుండా వడ్డీల పేరుతో మోసం చేసి అతని దగ్గర నుంచి వీలైనంత ఎక్కువ సొమ్ము తీసుకుంటున్నారు.
అయితే ఇలా వడ్డీ పేరుతో పేదల ప్రాణాలు హరించే వారి నుంచి ఆహారం అస్సలు తీసుకోకూడదు.
ఆహారమే కాదు కొంచెం తాగే నీరు కూడా తీసుకోకూడదని గరుడ పురాణం చెబుతోంది.
అలాగే మహిళలు తాము వెళ్లే మార్గం మంచిది కాదని తెలిసినప్పటికీ కూడా తన ఇష్టపూర్వకంగా ఆ మార్గంలోకి వెళితే ఆమె నుంచి ఆహారం అస్సలు తీసుకోకూడదు.
"""/" /
అలాంటి స్త్రీల నుంచి ఆహారం తీసుకోవడం వలన మానవ ధర్మాన్ని అవమానించినట్లే.
అలాగే తెలిసి తెలియక చేసిన తప్పులకు క్షమాపణ ఉంటుంది.కానీ తప్పని తెలిసి కూడా చేసిన వారికి క్షమాపణ అస్సలు ఉండదు.
ఇక అంటు వ్యాధి లేదా నయం చేయలేని తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న వారి నుంచి అస్సలు ఆహారాన్ని తీసుకోకూడదు.
ఎందుకంటే ఆ వ్యక్తి తన పాపము వల్ల అనారోగ్యానికి గురయ్యి ఉండొచ్చు.అందుకే అతని నుంచి ఆహారం స్వీకరిస్తే అతని పాపాన్ని మీరు కూడా పొందవచ్చు.
ఇక గరుడ పురాణం ప్రకారం హిజ్రాల నుంచి కూడా ఆహారం తీసుకోకూడదు.హిజ్రాలకు మనం దానం చేస్తే పుణ్యం వస్తుంది.
కానీ వారి వారిలో పాపాలు చేసిన వారు కూడా ఉంటారు.అందుకే హిజ్రాలకు దానధర్మాలు చేయవచ్చు కానీ వారి నుండి ఆహారాన్ని తీసుకోకూడదు.
వీడియో: ఈ చిన్నారి ఎంత డ్రామా చేస్తుందో చూస్తే నవ్వాపుకోలేరు..