వ్యాయామం చేసేవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఆరోగ్యంగా, ఫీట్‌గా ఉండేందుకు ఇటీవ‌ల కాలంలో అంద‌రూ వ్యాయామంపై మ‌క్కువ చూపుతున్నారు.రోజులో ఉద‌య‌మో లేదా సాయంత్ర‌మో కొంత స‌మ‌యాన్ని వ్యాయామానికి కేటాయిస్తూ చెమ‌ట‌లు చిందిస్తున్నారు.

అవును, వ్యాయామం అనేది ఆరోగ్యాన్ని ఎల్ల‌ప్పుడూ ర‌క్షించ‌డ‌మే కాదు మాన‌సిక ప్ర‌శాంత‌త‌ను కూడా అందిస్తుంది.

అయితే రెగ్యుల‌ర్‌గా వ్యాయామం చేయ‌డం ఎంత ముఖ్య‌మో వ్యాయామం చేసే వారు స‌రైన ఆహారం తీసుకోవ‌డం కూడా అంతే ముఖ్యం.

"""/"/ కానీ, వ్యాయామం చేసే వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి ? అన్న దానిపై చాలా మందికి అవ‌గాహ‌న లేదు.

అలాంటి వారికి ఇప్పుడు చెప్ప‌బోయే విష‌యాలు ఖ‌చ్చితంగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి.వాస్త‌వానికి వ్యాయామం చేయాలంటే శ‌రీరానికి త‌గిన శ‌క్తి కావాలి.

కానీ, కొంద‌రు ఎలాంటి ఆహారం తీసుకోకుండానే కాళీ క‌డుపుతో వ‌ర్కౌట్లు చేస్తుంటారు.ఇలా చేయ‌డం చాలా పొర‌పాటు.

వ్యాయామానికి అర గంట ముందు యాపిల్ లేదా అర‌టి పండు లేదా ఖ‌ర్జూరం పండ్లు తీసుకుంటే శ‌రీరానికి త‌గినంత శ‌క్తి ల‌భిస్తుంది.

"""/"/ అలాగే వ్యాయామం చేసే వారు ప్రోటీన్‌ను ఎక్కువ‌గా తీసుకోవాలి.అందువ‌ల్ల‌, గుడ్డు, పాలు, చేప‌లు, వోట్ మీల్, కిడ్నీ బీన్స్‌, చిక్కుళ్లు, మొల‌క‌లు, బ‌ఠానీలు, శ‌న‌గ‌లు వంటి డైట్‌లో ఉండేలా చూసుకోవాలి.

వ్యాయామం చేసే వారికి గుడ్ ఫ్యాట్స్ చాలా అవ‌స‌రం.న‌ట్స్‌లో పుష్క‌లంగా మంచి కొవ్వులు దొరుకుతాయి.

కాబ‌ట్టి, బాదం, జీడిప‌ప్పు, వాల్ నట్స్‌, పిస్తా, బ్రెజిల్ నట్స్, పీనట్స్ వంటివి తీసుకోవాలి.

వ్యాయామం చేసేవారు కొబ్బరి, బెల్లం పొడితో క‌లిపి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు.

అలాగే వ్యాయామం చేసే వారు ఖ‌చ్చితంగా డైలీ డైట్‌లో ఏదో ఒక పండు ఉండేలా చూసుకోవాలి.

ఒక క‌ప్పు పెరుగును కూడా ప్ర‌తి రోజు తీసుకోవాలి.ఇక గ్రీన్ టీ వ్యాయామానికి ముందు లేదా వ్యాయామం త‌ర్వాత ఎప్పుడైనా తీసుకోవ‌చ్చు గ్రీన్ టీ తీసుకుంటే సూప‌ర్ ఎన‌ర్జీ ల‌భిస్తుంది.

మ‌రో విష‌యం ఏంటంటే.వ్యాయాయం ఎక్కువ స‌మ‌యం చేస్తే శ‌రీరం డీహ్రైడేట్ అవుతుంది.

కాబ‌ట్టి, వాట‌‌ర్ ఎక్కువ‌గా తీసుకోవాలి.

వనపర్తి కాంగ్రెస్ లో చేరికల లొల్లి.. ఎమ్మెల్యే మేఘారెడ్డి నివాసం వద్ద నిరసన.!