పక్షులకు నిజంగానే చేతులున్నాయా..ఈ వీడియో చూస్తే మీ కండ్లను మీరే నమ్మలేరు
TeluguStop.com
కొన్ని వీడియోలు చూస్తే నిజంగా మన కండ్లను మనమే నమ్మలేకుండా ఉంటాయి.ఎందుకంటే వాటిని అంత అత్యద్భుతంగా తీర్చిదిద్దుతారు.
పెరుగుతున్న టెక్నాలజీ పుణ్యమా అని ఇలాంటివి సాధ్యం అవుతున్నాయి.కాగా మనకు సాధారణంగానే పక్షులకు లేదంటే జంతువులకు సంబంధించిన వీడియోలు చూస్తే ఎంతో ఆసక్తిగా అనిపిస్తుంది.
మనకు కూడా నిజంగానే పక్షుల్లాగే ఎగరగలిగితే ఎంత బాగుంటుందో కదా అని ఎప్పుడో ఒకసారి అయినా అనిపిస్తుంది.
మరి పక్షులు కూడా వాటికి చేతులు ఉంటే ఎంత బాగుంటుందో అని అనుకుంటే ఎలా ఉంటుంది.
అవునండి ఇప్నుడు పక్షులు కూడా తమకు చేతులొస్తే బాగుంటుందో అంటూ సోషల్ మీడియాలో పాడుకుంటున్నాయంటే నమ్మండి.
ఇక తమకు కూడా మనుషుల్లాగే కీ బోర్డుపై సంగీతం వాయించవచ్చని నిరూపిస్తున్నాయి.అది చూస్తే నిజంగానే వాటికి చేతులు ఉన్నాయనా అని అనిపించక మానదేమో.
కాగా అసలు పక్షులకు చేతులు వస్తే ఎలా ఉంటుందో అనే కాన్సెప్ట్ మీద ఓ వీడియో తీగయా అది కాస్తా వైరల్ అవుతోంది.
మరి పక్షులకు నిజంగానే చేతులు వస్తే ఎలాంటి పనులు చేయగలుగుతాయో తెలుసుకోవాలంటే ఈ వీడియో గురించి తెలుసుకోవాల్సిందే.
ఇక ఈ వీడియో చూస్తే నిజంగా కొంచెం సరదాగా ఉన్నాకూడా ఇందులో చాలా అర్థం ఉంది.
ఇంకా చెప్పాలంటే ఈ వీడియోలో అసలు మనిషి జీవితం ఎలా మారిపోయిందో కూడా అర్థం అవుతోంది.
ఇందులో ఒక పక్షికి చేతులు వస్తే అది చెట్టు కొమ్మపై కూర్చుని తన చేతులతో మొబైల్ పట్టుకుని సెల్పీ వీడియో తీసుకోవడం కనిపిస్త్ఉంది.
ఇంకో పక్షి ఏమో షాపింగ్ బిల్లు చూసుకోవడం, మరో పక్షి ఏమో చెట్టుపై కూర్చుని గిటార్ వాయించుకోవడం మనకు కనిపిస్తున్నాయి.
అయితే ఈ వీడియోలో ఎక్కడా కూడా గ్రాఫిక్స్ లాగా అనిపించకుండా నిజంగానే చేతులు ఉన్నాయా అనేంతలా ఉంది.
రెండు పెంగ్విన్లు తమ కొత్తగా వచ్చిన చేతులతో ఆఫీస్ నుంచి తిరిగి ఇంటి వస్తుంటాయి.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మే18, శనివారం 2024