మీలో ఎవరికైనా ప్రయాణం చేసే సమయంలో వాంతులు అవుతున్నాయా..? అందుకు అసలైన కారణం ఏమిటంటే..?!
TeluguStop.com
చాలా మందికి వివిధ వాహనాల్లో ప్రయాణాలు చేస్తే వాంతులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
అంతేకాకుండా వాంతుల వల్ల తలనొప్పి, నీరసం, శరీరమంతా నొప్పిగా కూడా ఉంటుంది.ఇలా వాంతులు రాకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే వాంతులు అనేవి పూర్తిగా తగ్గిపోతాయి.
బస్సు, కార్లల్లోనే కాకుండా రైలు, ఏరోప్లేన్, వంటి వాటిల్లో కూడా ప్రయాణం అంటే వాంతులు చేసుకునే వారు చాలా మందే ఉన్నారు.
దీనిని మోషన్ సిక్ నెస్ అని పిలుస్తుంటారు.ఈ సమస్య అందరిలో ఒకేలా ఉండకపోయినా వేర్వేరుగా ఉంటుంది.
చాలామంది ప్రయాణాలు చేసేటప్పుడు మద్యం సేవిడం, పొగ తాగడం వంటివి చేస్తుంటారు.ఇలా చేస్తే వాంతి సమస్యను మనమే కొని తెచ్చుకున్నట్టవుతుంది.
అలానే ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారాలను కూడా తినకూడదు.ఆడవారితో పోలిస్తే మగవారిలో వాంతులు వచ్చే సమస్య తక్కువగానే ఉంటుంది.
చిన్న పిల్లలలోను, ఆడవారిలోను సెన్సిటివ్ నెస్ ఎక్కువగా ఉండడం వల్ల ప్రయాణాల్లో వాంతులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
వాంతులు అవడానికి చెవిలో ఉండే లాబ్రింథైస్అనే భాగం కారణం అని వైద్యులు చెబుతున్నారు.
ఈ భాగం శుభ్రం గా లేని సమయంలో వాంతులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
స్నానం చేసేటపుడు చెవులను కూడా నిత్యం శుభ్రపరుచుకోవాలి.అలా చెయ్యని వారిలో ఈ సమస్య తీవ్రతరమయ్యే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
ఎక్కడికైనా ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు దానికి ముందుగా భోజనం చేయరాదు.ఒకవేళ తినాల్సి వస్తే కొద్దిగా తీసుకోవాలి.
ఎక్కువగా తింటే ప్రయాణంలో వాంతులు వచ్చేందుకు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు.
ప్రయాణంలో వాంతులు రాకుండా ఉండాలంటే పుదీనా ఆకులను నమిలినా, పుదీనా టీ తాగినా సమస్య తగ్గుముఖం పడుతుంది.
వాహనాల నుంచి వచ్చే పెట్రోల్, డీజిల్ వాసన, ఇతర వ్యక్తుల చెమట వాసన కలిపి ఒక్కోసారి వాంతులు వస్తాయి.
అలాంటప్పుడు సువాసన వెదజల్లే పువ్వులను వాసన పీల్చుకుంటే ఫలితం ఉంటుంది.మామూలుగా వాంతులు వస్తాయని ముందే తెలిసిన వారు నిమ్మకాయలను తమ దగ్గరే ఉంచుకుంటుంటారు.
ఇందులో ఉండే అసిడిక్ నేచర్ కారణంగా ఉపశమనం లభిస్తూ ఉంటుంది.కాపర్, ఐరన్, జింక్ వంటివి ఉండే అల్లం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది.
ఉన్నట్లుండి వాంతి అవబోతున్నట్లు అనిపిస్తే మీ చేతి బొటన వేలు, మణికట్టు కలిసే చోట రబ్ చేస్తూ ఉండడం వలన కూడా ఉపశమనం పొందొచ్చు.
చాలామందికి తాను ప్రయాణం చేస్తే వాంతి వస్తుందనే భావన గలవారు.ప్రయాణానికి ముందుగా అల్లం రసాన్ని తీసుకోండి.
లేదా మార్గమధ్యలో ఉన్నా అల్లం టీ తాగాలి.ఇలా చేస్తే వాంతులు రాకుండా ఆపవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి31, సోమవారం 2025